మళ్లీ పంజా విసిరిన చిరుత..

రామాయంపేట: చిరుత పులి మళ్లీ పంజా విసిరింది. గత కొంతకాలంగా ఎలాంటి దాడులు చేయకుండా ఉండి తాజగా ఓ దూడ పై దాడిచేసి చంపి వేసింది. ఈ ఘటన రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దరాములు తన వ్యవసాయ పొలం వద్ద పశువులను కట్టి వేశాడు. సోమవారం ఉదయం అక్కడి వెళ్లి చూసే సరికి దూడ మృతిచెంది ఉంది. దాని కడుపు బాగమంతా […]


రామాయంపేట: చిరుత పులి మళ్లీ పంజా విసిరింది. గత కొంతకాలంగా ఎలాంటి దాడులు చేయకుండా ఉండి తాజగా ఓ దూడ పై దాడిచేసి చంపి వేసింది. ఈ ఘటన రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దరాములు తన వ్యవసాయ పొలం వద్ద పశువులను కట్టి వేశాడు. సోమవారం ఉదయం అక్కడి వెళ్లి చూసే సరికి దూడ మృతిచెంది ఉంది. దాని కడుపు బాగమంతా చీల్చి ఉండడంతో చిరుత దాడి చేసి చంపి వుంటుందని తెలిపారు. ఈ మేరకు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల కాలంలో చిరుత దాడులు చేయక స్తబ్ధతగా ఉండడం ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరి దాడులను తిరిగి కొనసాగిస్తుండడం వలన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇట్టి చిరుతను అటవి అధికారులు పట్టుకొని ప్రజలతో పాటు పశువులను కాపాడాలని కోరుతున్నారు.

Comments

comments

Related Stories: