మల్లాయపల్లి విద్యార్థికి విఎ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంక్

మన తెలంగాణ/పాన్‌గల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన  వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పోటీ పరీక్షల్లో పాన్‌గల్ మండలంలోని మల్లాయపల్లికి చెంది న ఉల్చకోటి గణేష్‌రెడ్డి అనే విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంక్ సాధించాడు. 300 మార్కులకు గాను 220 మార్కులను సాధించి పశుసంవర్థక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి టిఆర్‌ఎస్ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి ప్రోత్సాహంతో వెటర్నరీ విశ్వవిద్యాలయం లో డిప్ల్లొమా ఇన్ వెటర్నరీ  సైన్స్‌కోర్సును పూర్తి చేశారు. […]

మన తెలంగాణ/పాన్‌గల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన  వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పోటీ పరీక్షల్లో పాన్‌గల్ మండలంలోని మల్లాయపల్లికి చెంది న ఉల్చకోటి గణేష్‌రెడ్డి అనే విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంక్ సాధించాడు. 300 మార్కులకు గాను 220 మార్కులను సాధించి పశుసంవర్థక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి టిఆర్‌ఎస్ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి ప్రోత్సాహంతో వెటర్నరీ విశ్వవిద్యాలయం లో డిప్ల్లొమా ఇన్ వెటర్నరీ  సైన్స్‌కోర్సును పూర్తి చేశారు. 12వ ర్యాంక్‌సాధించిన గణేష్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతో ఉద్యోగాన్ని సాధించానని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో పాన్‌గల్ మండలానికి పేరు తెచ్చిన గణేష్ రెడ్డిని  జడ్పిటిసి కేతేపల్లి రవి, ఎంపిపి వెంకటేష్‌నాయుడు, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యులు తిరుపతయ్య సాగర్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు గోవర్దన్‌సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల్‌రాజుయాదవ్, నాయకులు కేతేపల్లి విష్ణు, వీరసాగర్, కొండల్, రామస్వామి తదితరులు  అభినందించారు.

Related Stories: