మలేసియా ప్రధానితో జకీర్ భేటీ

ప్రభుత్వ వైఖరిని సమర్థించిన అధికార పార్టీ కౌలాలంపూర్: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, మనీలాండరింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మలేసియాలో తలదాచుకున్న వివాదాస్పద మతగురువు జకీర్ నాయక్ మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్‌ను కలిశారు. మరో వైపు జకీర్ నాయక్‌ను భారత్‌కు పంపించరాదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీకి చెందిన ఓ వ్యూహకర్త గట్టిగా సమర్థించినట్లు మలేసియా మీడియా కథనాలు పేరొకన్నాయి. మలేసియాలో శాశ్వతనివాస హోదా కలిగిన జకీర్ నాయక్ తమ దేశానికి చట్టపరంగా ఎలాంటి […]


ప్రభుత్వ వైఖరిని సమర్థించిన అధికార పార్టీ
కౌలాలంపూర్: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, మనీలాండరింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మలేసియాలో తలదాచుకున్న వివాదాస్పద మతగురువు జకీర్ నాయక్ మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్‌ను కలిశారు. మరో వైపు జకీర్ నాయక్‌ను భారత్‌కు పంపించరాదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీకి చెందిన ఓ వ్యూహకర్త గట్టిగా సమర్థించినట్లు మలేసియా మీడియా కథనాలు పేరొకన్నాయి. మలేసియాలో శాశ్వతనివాస హోదా కలిగిన జకీర్ నాయక్ తమ దేశానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందీ కలిగించనంతవరకు ఆయనను భారత్‌కు పంపించేది లేదంటూ మలేసియా ప్రధాని మహతిర్ రెండు రోజుల క్రితం స్పష్టం చేయడం తెలిసిందే. ఈ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే మహతిర్ శనివారం జకీర్ నాయక్‌ను కలవడం విశేషం. శనివారం మహతిర్‌ను కలవడం కోసం నాయక్ ఆయన నివాసానికి వెళ్లారని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ‘ఫ్రీ మలేసియా ’ పత్రిక తెలిసింది.

Related Stories: