మరుగుదొడ్డి నిర్మించుకోనందుకు దళితుని ఇంటిపై దాడి

కురవి : మరుగుదొడ్డి నిర్మించుకోనందుకు గ్రామ పంచాయతీ అధికారులు, కరెంట్ అధికారులు ఇంటిపై దాడి చేసి రూ.30 వేలు విలువ చేసే ఎల్‌సిడి టివి పగలగొట్టారని దళితుడు తోట మంగయ్య ఆవేధన వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కందికొండ గ్రామానికి చెందిన దళితుడు తోట మంగయ్య గత వారం రోజుల క్రితం రూ.2500 ఇస్తే మరుగుదొడ్డి కట్టిస్తామని, తప్పని సరిగా నిర్మించుకోవాలని లేకుంటే ఇంట్లో కరెంట్ తీసేస్తామని చెప్పారు. దీంతో సోమవారం అధికారులు […]

కురవి : మరుగుదొడ్డి నిర్మించుకోనందుకు గ్రామ పంచాయతీ అధికారులు, కరెంట్ అధికారులు ఇంటిపై దాడి చేసి రూ.30 వేలు విలువ చేసే ఎల్‌సిడి టివి పగలగొట్టారని దళితుడు తోట మంగయ్య ఆవేధన వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కందికొండ గ్రామానికి చెందిన దళితుడు తోట మంగయ్య గత వారం రోజుల క్రితం రూ.2500 ఇస్తే మరుగుదొడ్డి కట్టిస్తామని, తప్పని సరిగా నిర్మించుకోవాలని లేకుంటే ఇంట్లో కరెంట్ తీసేస్తామని చెప్పారు. దీంతో సోమవారం అధికారులు గ్రామానికి వచ్చి దళిత వాడలో ఉన్న కరెంట్ తీసేసి ఇంటిపై దాడి చేసి ఎల్‌సిడి టివి ద్వంసం చేసి వెళ్ళారని ఆదేమిటని నిలదీస్తే నీ దిక్కున్నకాడ చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. తిండానికి తండిలేక అనేక కష్టాలు పడుతూ కూలినాలి చేసుకుని బతికేవాళం మరుగుదొడ్డికి రూ.2500 ఎదురు డబ్బులు ఎక్కడిస్తామయ్యా అని ఆవేధన వ్యక్తం చేశారు. గ్రామంలో కూలి దొరక్కా  హైదరాబాద్‌కు వలస వెళ్ళి బ్రతుకుతున్నామని, పైసా పైసా కూడేసి ఎల్‌సిడి టివి కొనుక్కోని ఇంట్లో పెట్టుకుంటే సోమవారం అధికారులు వచ్చి మరుగుదొడ్డి కట్టుకుంటవాలేదా అంటు బలవంతంగా ఎల్‌సిడి పగలగొట్టి వెళ్ళారని బాధితుడు తెలిపాడు. పై అధికారులు విచారణ చేసి ద్వంసం చేసిన ఎల్‌సిడిని ఇప్పించాలని బాధితుడు తోట మంగయ్య కోరాడు.

Comments

comments

Related Stories: