మనీశ్ పాండే ఒంటరి పోరాటం..

కోల్‌కతాపై ముంబయి ఇండియన్స్ ఘన విజయం మెరిసిన రానా, పాండ్య ఓపెనర్‌గా విఫలమైన గంభీర్, నిరాశ పరిచిన లెన్.. ముంబయి : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. నైట్‌రైడర్స్ జట్టులో మనీశ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ తనదైన శైలిలో రాణిస్తూ ముంబయి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. జట్టులో ఒకరితరువాత ఒకరు […]

  • కోల్‌కతాపై ముంబయి ఇండియన్స్ ఘన విజయం
  • మెరిసిన రానా, పాండ్య
  • ఓపెనర్‌గా విఫలమైన గంభీర్, నిరాశ పరిచిన లెన్..

ముంబయి : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. నైట్‌రైడర్స్ జట్టులో మనీశ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ తనదైన శైలిలో రాణిస్తూ ముంబయి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. జట్టులో ఒకరితరువాత ఒకరు పేలవ ప్రదర్శనతో పెవిలియన్‌కు క్యూ కట్టేసిన అలుపెరుగని ఉత్సాహంతో మనీశ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఆట చివరి వరకు బాధ్యతాయుతమైన స్కోరు (47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్)తో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, ఐపిఎల్-10 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఆదివారం ఇక్కడ ముంబయి ఇండియన్స్ జట్టుకు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ముంబయి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లలో కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆదిలోనే వెనుదిరిగాడు. క్రునాల్ పాండ్య బౌలింగ్‌లో మెక్లెంగన్‌కు క్యాచ్ ఇచ్చి 19 పరుగులకే గంభీర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఆటగాడు ఉతప్ప కూడా పేలవ ప్రదర్శనతో 4 పరుగులకే చేతులేత్తేశాడు. అనంతరం బరిలోకి దిగిన క్రిస్ లెన్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో 32 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లుగా పెవిలియన్‌కు చేరాడు. మిగతా ఆటగాళ్లు యూసఫ్ పటాన్ (6), సూర్య కుమార్ యాదవ్ (17), క్రిస్ వోక్స్ (9), సునీల్ నరేన్ (1) పరుగులతో వెనుదిరిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా జట్టు 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో క్రునాల్ పాండ్య మూడు వికెట్లు తీసుకోగా, మలింగ రెండు వికెట్లు, మెక్‌ల్లెంగమ్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 179 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ 2 ఓవర్లు ముగిసే సరికి 15 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన పార్థీవ్ పటేల్ (6), బట్లర్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్:
గౌతమ్ గంభీర్ (సి) మెక్‌ల్లెంగన్ (బి) క్రునాల్ పాండ్య ; 19, క్రిస్ లెన్ ఎల్‌బిడబ్లు (బి) బుమ్రా ; 32, ఉతప్ప (సి) హార్ధిక్ పాండ్య ; 4, మనీష్ పాండే నాటౌట్ ; 81, యూసఫ్ పటాన్ (సి) హర్ధీక్ పాండ్య (బి) క్రునాల్ పాండ్య ; 6, సూర్య కుమార్ యాదవ్ (సి) పోలార్డ్ (బి మలింగ; 17, వోక్స్ (సి) పోలార్డ్ (బి) మలింగ; 9, నరేన్ ఎల్‌బిడబ్లు (బి) మెక్‌ల్లాంగన్; 1. ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లు) 178 పరుగులు.
వికెట్ల పతనం: 1-44, 2-48, 3-67, 4-87, 5-131, 6-144, 7-178.
ముంబై బౌలర్లు: మలింగ : 4-0-36-2, మెక్‌ల్లెంగన్ : 4-0-51-1, బుమ్రా : 4-0-39-1, క్రునాల్ పాండ్య : 4-0-24-3, హర్భజన్ సింగ్ : 4-0-27-0.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ :

Batsmen Runs Balls SR 4s 6s

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లు) 178 పరుగులు.

Related Stories: