మనస్థాపంతో విద్యార్థిని బలవన్మరణం

రాజన్న సిరిసిల్ల: మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపెల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. అపర్ణ(19) అనే విద్యార్థిని ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో  సరైన ర్యాంక్ రాలేదు. దీంతో డిగ్రీ చదువనని చెబుతూ… ఈ సంవత్సరం కూడా లాంగ్ టర్మ్ కోచింగ్‌లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరింది. దీనికి తల్లిదండ్రులు నిరాకరించారు. అంతేగాకా విద్యార్థిని డిగ్రీలో చేర్పించి హాస్టల్‌లో ఉంచారు.  సెలవుపై ఇంటికి వచ్చిన ఆ యువతి మనస్థాపానికి లోనై బావిలో […]

రాజన్న సిరిసిల్ల: మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపెల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. అపర్ణ(19) అనే విద్యార్థిని ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో  సరైన ర్యాంక్ రాలేదు. దీంతో డిగ్రీ చదువనని చెబుతూ… ఈ సంవత్సరం కూడా లాంగ్ టర్మ్ కోచింగ్‌లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరింది. దీనికి తల్లిదండ్రులు నిరాకరించారు. అంతేగాకా విద్యార్థిని డిగ్రీలో చేర్పించి హాస్టల్‌లో ఉంచారు.  సెలవుపై ఇంటికి వచ్చిన ఆ యువతి మనస్థాపానికి లోనై బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బావిలో నుంచి ఆమెను బయటకు తీసి దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే యువతి మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Related Stories: