మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని బండారి వైష్ణవి (13) ఆదివారం రాత్రి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల రూరల్ పోలీసుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన బండారి నందయ్య అనే రైతుకు ముగ్గురు కూతుళ్లు కాగా చిన్న కూతురైన వైష్ణవి ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి సైకిల్ తీసుకుని వెళ్లింది. చీకటి పడుతున్నా వైష్ణవి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి నందయ్య […]


జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని బండారి వైష్ణవి (13) ఆదివారం రాత్రి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల రూరల్ పోలీసుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన బండారి నందయ్య అనే రైతుకు ముగ్గురు కూతుళ్లు కాగా చిన్న కూతురైన వైష్ణవి ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి సైకిల్ తీసుకుని వెళ్లింది. చీకటి పడుతున్నా వైష్ణవి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి నందయ్య ఆమె స్నేహితుల ఇళ్లలో వెతికినా కనిపించలేదు. వైష్ణవి సైకిల్ గ్రామ శివారులోని తన వ్యవసాయ బావికి కొద్ది దూరంలో కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురై బావి వద్దకు వెళ్లగా బావి గట్టున ఆమె చెప్పులు కనిపించడంతో బావిలో పడిందనే నిర్ణయానికి వచ్చాడు. అప్పటికే రాత్రి కావడంతో ఆదివారం ఉదయం విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి బావిలోంచి నీటిని తోడగా వైష్ణవి శవమై కనిపించింది. ఇంట్లోని వంట పాత్రలను శుభ్రం చేయమని తల్లి మందలించినందుకే వైష్ణవి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. నందయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

comments

Related Stories: