మనసు దోచుకుంటున్న ధోతి

Indian Traditional Mens dhotis

ఇప్పుడు కాలేజీల్లో, ఆఫీసుల్లో, బంధువుల దగ్గర ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరిలో కొత్తగా కనిపించేందుకు యువత ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మార్కెట్లోకి ఎన్నీ కొత్త డ్రెసింగ్ వచ్చినా యువత మాత్రం ధోతిపై ఎక్కువ ఆశ చూపిస్తున్నారు.  

అచ్చతెనుగు సంప్రదాయం ధోతి కట్టులోనే ఉందంటారు. తెలుగురాష్ట్రల్లో  ధోతి కట్టడమన్నది ఒక గౌరవ సూచకం ఆచారం ఉంది. శుభకార్యాలలో పురుషులు ధోతులు ధరించి కనబడడం మనకు తెలిసిందే! మన తాతలు, తండ్రులే కాదు, మన అన్నదమ్ములు, స్నేహితులు కూడా ధోతులు కట్టి తీరాల్సిందే. ఇది ఎక్కువగా వివాహ సమయంలో పెళ్ళి కుమారుడు ధోతిని ధరించడం ఆచారం. ’ధోతి’ అనే పేరు ’ధౌతి’ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ధౌతి అంటే శుభ్రం చేసినది అని అర్థం. మతపరమైన ఆచారాల్ని నిర్వహించేటపుడు ధోతిని కట్టుకుని తీరాల్సిందే. ధోతికి వేష్ఠి, ధోతీ, ధుతి, మర్దానీ, చాద్రా, ధోతర్, పంచె, తదితర అనేకమైన పేర్లు వాడుకలో ఉన్నాయి. భారతీయ పురుషునికి ధోతి ధారణ ఒక గుర్తింపునిస్తుంది. నాలుగున్నర మీటర్ల పొడవుండే ఈ ధోతిని పలు ప్రాంతాల్లో పలు రకాలుగా నడుం చుట్టూ ధరిస్తారు. ’పంచ’ అనే ధోతిని జైనులు ఆలయానికి వెళ్ళేటపుడు ధరిస్తారు. కుట్టడమన్నది లేనేలేని పంచను ధరించడం వల్ల జీవహింస జరిగే అవకాశమే లేదని, అది ప్రకృతికి ఎలాంటి హానిని కలిగించదని నమ్ముతారు. మనదేశంలో ధోతిలాగానే ’లుంగీ’ని కట్టడం కూడా సర్వసాధారణమే! అంతే కాకుండా గ్రామాల్లో చూస్తే ఇప్పటికి ఈ ధోతిలు కట్టుకుని పెద్దవారు మనకు కనిపిస్తుంటారు. మహాత్మగాంధీ లాంటి స్వతంత్ర సమరయోదులు కూడా అప్పట్లో ధోతీలు కట్టుకుని భారతదేశ సంప్రదాయాన్ని తెల్లవారికి చూపించారు. ఇప్పుడు యువత ధోతిలను కట్టుకుని పాత విధానాన్ని కొత్తగా పరిచయం చేస్తున్నారు.

Comments

comments