మనసుకు తోచిందే చేస్తా..

అసలు పేరు: డయానా మరియమ్ కురియన్ మారుపేరు: లేడీ సూపర్ స్టార్, నయనతార, నాయన్, మణి తల్లిదండ్రులు: కురియన్ కొడియట్టు, ఓమానా కురియన్ సోదరుడు: లేను కురియన్ పుట్టిన తేది: 18 నవంబర్ 1984 పుట్టిన స్థలం: బెంగళూరు ఉండేది: తిరువల్ల, కేరళ చదువు: ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ ఇష్టమైన నటులు: రజినీకాంత్, విజయ్, సిమ్రాన్ తెలుగు ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. అయినా చంద్రముఖి, లక్ష్మి, బాస్, యోగి, అదుర్స్, సింహ, […]

అసలు పేరు: డయానా మరియమ్ కురియన్
మారుపేరు: లేడీ సూపర్ స్టార్, నయనతార, నాయన్, మణి
తల్లిదండ్రులు: కురియన్ కొడియట్టు, ఓమానా కురియన్
సోదరుడు: లేను కురియన్
పుట్టిన తేది: 18 నవంబర్ 1984
పుట్టిన స్థలం: బెంగళూరు
ఉండేది: తిరువల్ల, కేరళ
చదువు: ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్
ఇష్టమైన నటులు: రజినీకాంత్, విజయ్, సిమ్రాన్

తెలుగు ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. అయినా చంద్రముఖి, లక్ష్మి, బాస్, యోగి, అదుర్స్, సింహ, కృష్ణం వందే జగద్గురుం, జై సింహా సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది అందలతార నయనతార. ఇప్పటికి నేటి తరం హీరోయిన్స్‌కి పోటీగా ఎన్నో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్త్తోంది. రెండుసార్లు ప్రేమలో విఫలమైనా, కెరీర్‌లో మాత్రం విజయాలకు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తోంది.

నయనతారకు ఫేస్‌బుక్‌లాంటి వాటిలో ఖాతాలు లేవు. ఎక్కువగా జనాల్లోకి వెళ్లడం తనకు నచ్చదు. తెలిసిన వాళ్లు వచ్చే వేడుకలకు మాత్రమే హాజరవుతుంది. ఖాళీ సమయం దొరికినప్పుడు తిరువల్లలో అమ్మానాన్నల దగ్గరికో, దుబాయ్‌లో అన్నయ్య ఇంటికో వెళ్లడం అలవాటు. నిజాయితీగా ఉండే మగవాళ్లను ఎవరైనా ఇష్టపడతారు. అది చాలా చిన్న లక్షణంలానే అనిపించినా ప్రతి చిన్న విషయంలోన నిజాయితీగా ఉండటం చాలా కష్టమైన విషయం అని నయనతార అభిప్రాయం.

పుట్టుకతోనే క్రిస్టియన్ అయినా గుడికి వెళ్లడం కూడా అలవాటు. ఇప్పటి వరకు హరిద్వార్, రిషికేష్‌లాంటి అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లింది. తమిళనాడులో ప్రజల ఓటింగ్ ద్వారా టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాలో మొదటి స్థానం దక్కింది. అవార్డులకంటే గుర్తింపే నాకు చాలా ఇష్టం అంటోంది. సెట్స్‌లో ఉన్నప్పుడు ఇతర యూనిట్ సభ్యులకు ఏ ఆహారం పెడతారో తనకు కూడా అదే పెట్టమని అడుగుతుంది. డైటింగ్‌కి చాలా దూరం.

వారంలో నాలుగు రోజులైనా జిమ్‌కి వెళ్తుంది. ‘యారాడి నీ మోహిని’ (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే)లో నా పాత్రంటే నాకు చాలా ఇష్టం అని అందులో హీరోయిన్ బయట ఉద్యోగం చేస్తూ, చాలా స్వేచ్ఛగా, ఆధునికంగా ఉంటుంది. ఊరికెళ్లినప్పుడు మాత్రం కుటుంబానికీ, బంధువులకూ చాలా విలువిస్తుంది అచ్చు నాలాగే అని ఒక ఇంటర్వూలో చెప్పింది. ఎవరికైనా గ్లామర్ అనేది దుస్తుల్లోనో, మేకప్‌లోనో కాదు, వ్యక్తిత్వంలో ఉంటుందని ఆమె అభిప్రాయం. నయనతార చేసిన సినిమాల్లో బికినీల కంటే చీరల్లో, తక్కువ మేకప్‌తో నటించిన పాత్రల్లోనే ఎక్కువ అందంగా కనిపిస్తుంది. శ్రీరామరాజ్యం చిత్రంలో సీతాదేవిగా నటించి ఫిలింఫేర్, నంది అవార్డుని కూడా పొందింది.

Comments

comments

Related Stories: