మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన దయానంద్

సత్తుపల్లి: స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం దిశ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని వంట కార్మికులకు సూచించారు. వంట కార్మికులకు పెండింగ్‌లో వున్న వేతనాలు వెంటనే విడుదల అయ్యేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని క్రమ […]

సత్తుపల్లి: స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం దిశ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని వంట కార్మికులకు సూచించారు. వంట కార్మికులకు పెండింగ్‌లో వున్న వేతనాలు వెంటనే విడుదల అయ్యేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని క్రమ శిక్షణతో విద్యనభ్యసించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం స్వీకరించారు. ఆయన వెంట పలువురు టిఆర్‌ఎస్ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Related Stories: