మధ్యాహ్నం భోజనంపై నీలినీడలు

జూనియర్ కళాశాల విద్యార్థుల ఆకలి కేకలు మూడేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అమలు చేస్తామని మంత్రి వెల్లడించినా అందని ఆదేశాలు కళాశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు శాతం మన తెలంగాణ/మంచిర్యాల: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గత మూడేళ్లుగా కళాశాలల్లో మధ్యా హ్న భోజనం అమలు చేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి వెల్లడించినప్పటికీ అధికారులకు ఆదేశాలు అందలేదు. దీంతో ఉదయం పూట వస్తున్న విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అలమటించి అవస్థల పాలవుతున్నారు. జూనియర్ కళాశాలల్లో […]

జూనియర్ కళాశాల విద్యార్థుల ఆకలి కేకలు
మూడేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం
అమలు చేస్తామని మంత్రి వెల్లడించినా అందని ఆదేశాలు
కళాశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు శాతం

మన తెలంగాణ/మంచిర్యాల: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గత మూడేళ్లుగా కళాశాలల్లో మధ్యా హ్న భోజనం అమలు చేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి వెల్లడించినప్పటికీ అధికారులకు ఆదేశాలు అందలేదు. దీంతో ఉదయం పూట వస్తున్న విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అలమటించి అవస్థల పాలవుతున్నారు. జూనియర్ కళాశాలల్లో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ కాకపోవడంతో మధ్యాహ్న భోజనంపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడకపోవడంతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ విద్య సంవత్సరం నుంచి అమలు చేస్తామని మంత్రి మరోసారి ప్రకటించినప్పటికీ కళాశాలలు ప్రారంభం అయినా ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడేళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు,ప్రత్యేక తరగతుల నిర్వాహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టికి కేంద్రీకరించగా కేవలం పాఠ్యపుస్తకాలు అందించారే తప్పా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం లేదు. దీంతో విద్యార్థులు ఖాళీ కడుపులతోనే కళాశాలలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రధానంగా ఇబ్బందులకు గురువుతున్నారు. జిల్లాలోని మంచిర్యాల,మందమర్రి, కాసిపేట, చెన్నూర్, బెల్లంపల్లి(బాలురు), బెల్లంపల్లి(బాలికలు), జైపూర్, దండేపల్లి, లక్షెట్టిపేట పట్టణాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఎంపిసి, బైపిసి, హెచ్‌ఈసి, సిఈసితో పాటు వృత్తి విద్య కోర్సులైన ఎంఎల్‌టి, ఎంపిహెచ్‌డబ్లు, సిఎస్‌సి కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 18 00 మంది విద్యార్థులు చదువుకోగా 201718 విద్యా సంవత్సరంలో 2800 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. జిల్లాలో 18 మండలాలకు గాను 9 మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. అదే విధంగా తాండూర్, భీమిని, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన కన్నెపల్లి, నస్పూర్, భీమారం ,హాజీపూర్‌లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు వెళ్లాలంటే రెండు గంటల ముందుగానే ఉదయం 7 గంటలకే విద్యార్థులు ఇండ్ల నుండి బయలు దేరాల్సి ఉంటుంది . పేద విద్యార్థుల ఇండ్లలో ఉదయం వంట కాకపోవడంతో అల్పహారం తీసుకోకుండానే కళాశాలలకు వెళ్తున్నారు. మద్యాహ్న వరకు ఖాళీ కడుపుతో అలుమటిస్తూ అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థం కాక ఇబ్బందులకు గురవుతున్నారు.

దాతల సహకారంతోనే మధ్యాహ్న భోజనం
దూరప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కొన్ని కళాశాలల్లో దాతలు ముందుకు వచ్చి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. లక్షెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల ప్రభుత్వ కళాశాలల్లో మంచిర్యాలకు చెందిన చత్రపతిసాహు మహరాజ్ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందించారు. అదే విధంగా చెన్నూర్, మందమర్రి, జైపూర్ కళాశాలల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు విద్యార్థుల ఆకలి బాధలకు చలించి మధ్యాహ్న భోజనం అందించారు. ఈ విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజనం పథకం పై అధికారికంగా ఉత్తర్యులు వెలువరించినట్లయితే విద్యార్థుల హాజరు శాతం పెరిగి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయి.

Comments

comments