మద్యం మత్తులో పచ్చి కోడినే పీక్కుతిన్నాడు!

మహబూబాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ఒక పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూటుగా మద్యం తాగిన సదరు యువకుడు పచ్చి కోడినే పీక్కుతిన్నాడు. ఈ సంఘటన మంగళవారం మహబుబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కోడిని కోనుక్కొని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మత్తులో నడవలేని స్థితిలో ఉన్న వారిద్దరూ ఆర్ఒబి సమీపంలో పడిపోయారు. ఆ […]

మహబూబాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ఒక పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూటుగా మద్యం తాగిన సదరు యువకుడు పచ్చి కోడినే పీక్కుతిన్నాడు. ఈ సంఘటన మంగళవారం మహబుబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కోడిని కోనుక్కొని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మత్తులో నడవలేని స్థితిలో ఉన్న వారిద్దరూ ఆర్ఒబి సమీపంలో పడిపోయారు. ఆ సమయంలో ఇద్దరిలో ఓ యువకుడు చేతిలో ఉన్న కోడిని చంపి పచ్చిదే పీక్కుతినడం ప్రారంభించాడు. అటుగా వెళ్లిన కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అంతే… ఆ వీడియో ఇప్పుడు  వైరల్ అవుతోంది.

Related Stories: