మణిరత్నం ‘నవాబ్’ట్రైలర్ అదిరిపోయిందంతే…!

NAWAB Official Telugu Trailer Released

హైదరాబాద్: సీనియర్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘నవాబ్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ముగింపులో అరవింద్ స్వామి చెప్పిన “నీకు ఎవరైన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా… అయితే  నమ్మొద్దు” అనే డైలాగ్ బాగుంది. ఈ సినిమాలో భారీ తారగణం నటిస్తుంది. ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, శింబు, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదరీ, జయసుధ, అరుణ్ విజయ్‌లు తదితరులు నటిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments