మంత్రి జోగు రామన్న చొరవతో.. బాలికకు పునర్జన్మ

ఆదిలాబాద్: రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న చొరవతో ఆదిలాబాద్ పట్ణణంలోని భూక్తాపూర్‌కు చెందిన ఆకాంక్షకు మరో జన్మ లభించింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 15 ఏళ్ల ఆకాంక్షను హైదరాబాద్‌లోని గ్లోబల్ దవాఖానలో కొంత కాలం క్రితం చికిత్స కోసం చేర్చారు. ఆకాంక్షకు గుండె మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు నిర్ణయించారు. అందుకు 22లక్షలు రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న స్పందించి ఈ విషయాన్ని […]


ఆదిలాబాద్: రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న చొరవతో ఆదిలాబాద్ పట్ణణంలోని భూక్తాపూర్‌కు చెందిన ఆకాంక్షకు మరో జన్మ లభించింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 15 ఏళ్ల ఆకాంక్షను హైదరాబాద్‌లోని గ్లోబల్ దవాఖానలో కొంత కాలం క్రితం చికిత్స కోసం చేర్చారు. ఆకాంక్షకు గుండె మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు నిర్ణయించారు. అందుకు 22లక్షలు రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సిఎం కెసిఆర్ వెంటనే తన ఉదారతను చాటి గుండె మార్పిడికి అవసరమైన రూ. 22 లక్షలు మంజూరు చేసి ఎల్‌ఒసి జారీ చేశారు. ఆకాంక్షకు గుండె మార్పిడి కోసం గుండె దాత కోసం చూస్తున్న తరుణంలో గ్లోబల్ ఆసుపత్రి వైద్యులకు అపోలో అసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 21 ఏళ్ల కుమార్ గుండె ఉందని తెలిసింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహకారాన్ని అందించడంతో 11 నిమిషాల స్వల్ప వ్యవధిలో అపోలో ఆసుపత్రి నుంచి గ్లోబల్ ఆసుపత్రికి గుండెను తరలించారు. గుండెను ఆకాంక్షకు అమర్చి ప్రాణాలు కాపాడారు. మంత్రి జోగు రామన్న చొరవ చూపడంతో ఆకాంక్షకు పునర్జన్మ లభించింది. గురువారం గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి ఆకాంక్ష ఆరోగ్య పరిస్థితిని మంత్రిజోగు రామన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆకాంక్షను పరామర్శించి ఆకాంక్ష కోలుకుంటున్న విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెంట బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కూడా ఉన్నారు. ఆకాంక్షతో పాటు కుటుంబీకులు మంత్రిజోగు రామన్నకు ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలిపారు.

Related Stories: