మండల వ్యవసాయ అధికారిపై ఫిర్యాదు

Complaint to the superior officers of the agricultural officer

కమాన్‌పూర్: కమాన్‌పూర్ మండల వ్యవసాయధికారి బండి ప్రమోద్ కుమార్‌పై పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసినట్టు మండల కేంద్రానికి చెందిన రైతు సాన బాలయ్య తెలిపారు. బుధవారం వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళ్లిన తనపట్ల ఎఒ ప్రమోద్ కుమార్ నానా దుర్భాషలాడుతు ఇష్టరీతిన ప్రవర్తించడంతో పాటు విధులకు అటంకం కలిగిస్తున్నాడని కేసులు పెడుతానని బెదిరించి భయాబ్రాంతులకు గురి చేసి అవమానపరిచిన మండల వ్యవసాయాధికారి బండి ప్రమోద్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సాన బాలయ్య పేర్కొన్నారు. రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంటే అధికారుల నిర్లక్షంతో అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదని ఆయన తెలిపారు. సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోని రైతులకు కార్యాలయంలో తగిన గౌరవం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సాన బాలయ్య తెలిపారు.

Comments

comments