మంచు పూసే వేళలో…

ఇంటికి వచ్చే అతిథులకు రకారకాల పానీయాలతో ఆహ్వానం పలుకుతాం. ఇది కలర్‌ఫుల్ మంచుపూల స్వాగత మన్నమాట. వెరైటీగా ఐస్‌క్యూబ్స్ ఫ్లవర్ డ్రింక్స్‌తో ఆతిథ్యం. వీటిని తాగడానికే కాదు అందంగా అలంకరణకు కూడా ఉపయోగించు కోవచ్చు. సౌందర్యపోషణలోనూ వీటి పాత్ర ప్రముఖమే. పొడిగుడ్డలో ఐస్‌ముక్కలను ఉంచి ముఖం మీద మృదువుగా మసాజ్ చేస్తే ఎండవేడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఐస్‌క్యూబ్స్‌లోనే సహజసిద్ధమైన పూలని అమర్చి ఫ్లవర్ ఐస్‌క్యూబ్స్‌ని తయారు చేస్తున్నారు. పార్టీల్లో పానీయాలకు ఫ్లవర్ ఐస్‌క్యూబ్స్‌ను జతచేస్తే అతిథులు […]

ఇంటికి వచ్చే అతిథులకు రకారకాల పానీయాలతో ఆహ్వానం పలుకుతాం. ఇది కలర్‌ఫుల్ మంచుపూల స్వాగత మన్నమాట. వెరైటీగా ఐస్‌క్యూబ్స్ ఫ్లవర్ డ్రింక్స్‌తో ఆతిథ్యం. వీటిని తాగడానికే కాదు అందంగా అలంకరణకు కూడా ఉపయోగించు కోవచ్చు. సౌందర్యపోషణలోనూ వీటి పాత్ర ప్రముఖమే. పొడిగుడ్డలో ఐస్‌ముక్కలను ఉంచి ముఖం మీద మృదువుగా మసాజ్ చేస్తే ఎండవేడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఐస్‌క్యూబ్స్‌లోనే సహజసిద్ధమైన పూలని అమర్చి ఫ్లవర్ ఐస్‌క్యూబ్స్‌ని తయారు చేస్తున్నారు. పార్టీల్లో పానీయాలకు ఫ్లవర్ ఐస్‌క్యూబ్స్‌ను జతచేస్తే అతిథులు మెచ్చుకోక మానరు. అనారోగ్య సమస్యలు రావు. వీటి పానీయాల తయారీకి డిస్టిల్డ్ వాటర్ ఉపయోగిస్తే మంచిది. ఈ ఐస్‌క్యూబ్స్‌ను తయారు చేయటానికి కొంత సమయం తీసుకున్నా అవి తీసుకునే పానీయాలకు అందాన్నిస్తాయి. మరి ఎడిబిల్ ఫ్లవర్ ఐస్‌క్యూబ్స్‌కి ఏ పూలని వాడవచ్చో చూద్దాం..

లావెండర్: తేనీరులో చల్లటి లావెండర్ ఐస్ క్యూబ్స్‌ను వేసుకుని కూల్‌టీ తాగొచ్చు. ఈ టీ తో ఒత్తిడి మటుమా యం అవుతుంది. గర్భవతులు మాత్రం దీన్ని తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంతి: ఈ చెట్లు ఎక్కడైనా త్వరగా పెరుగుతాయి. కూరగాయల మీద కీటకాలను నిల్వ ఉండకుండా ఈ ఐస్‌క్యూబ్స్‌ను వాడతారు. పొగతాగేవారు ఈ ఐస్‌క్యూబ్స్ పానీ యాన్ని తాగొ చ్చు.

మందార : ఈ ఐస్‌క్యూబ్స్‌ని జమైకాన్ హైబిస్కస్ టీలో వేస్తే మందార కలర్‌తో టీ కనిపిస్తుంది. ఒక గ్లాసునిండా నీటిని తీసుకుని ఈ ఐస్‌క్యూబ్స్‌ని వేసి తాగినా మంచిదే. అందమైన రంగులో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

పన్‌సీస్: ఇవి నీలం, పసుపు, పర్‌పుల్, ఆరెంజ్, ఎరుపు, తెలుపు వివిధ షేడ్స్‌లలో ఉంటాయి.
డాండిలియన్: ఐస్‌క్యూబ్స్‌గా తయారుచేసేముందు రేకులుని విడిగా తీయవచ్చు. పువ్వు మొత్తంగా పెట్టికూడా ఐస్‌క్యూబ్స్‌ని తయారుచేయొచ్చు.

బేగొనియాస్ : నారింజ రంగుతో ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి. వీటిని చక్కగా గాజు గ్లాసులో వేసి హాల్లో పెడితే ఆ అందమే వేరు.
కార్న్ ఫ్లవర్స్: ఎక్కువగా వసంత రుతువు ప్రారంభం లో వికసించే ఈ పూలు ఎరుపు, తెలుపు రంగుల్లో బాగుంటాయి.
గులాబీ: చిన్న సైజు పూలు అయితే మొత్తం పుష్పాన్ని ఐస్‌క్యూబ్స్‌లో అమర్చవచ్చు. గులాబీ రేకులు సౌందర్యానికీ ఉపయోగం.

Comments

comments