మంచినీళ్లు ఎక్కువగా తాగితే మంచిది..

water

వృద్ధాప్యంలో క్రమంగా ఆహారం తీసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏదైనా కావచ్చు. కానీ పౌష్టికాహారం అవసరం మాత్రం తగ్గదు. ఈ వయసులో కండరాల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది. మెదడు నుండి అవయవాలు అన్నీ క్షీణిస్తూ ఉంటాయి. అది వృద్ధాప్యంలో వచ్చే లక్షణం అయితే అయి వుండవచ్చు గానీ ఆ మార్పుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి ఆహారం ఎలా మార్పు చేసుకోవాలి అందరికీ తెలియాల్సిన విషయం.
వృద్ధాప్యంలో ఎముకలు బొలుసుగా మారతాయి. త్వరగా నీరసించి పోతూ ఉంటారు. దీనికి తోడు మధుమేహం, కీళ్ళవాపులు లాంటివి మొదలౌతాయి. కీళ్ళలో పట్టుతప్పి నడుస్తూ నడుస్తూ పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. చిన్నదెబ్బకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. వారు తీసుకునే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారు ఒకేసారి ఆహారం తీసుకోలేరు, అరుగుదల లేకపోవడం, నోటికి రుచి లేకపోవడంతో ఎక్కువ తినలేకపోతారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని అందించాలి. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పాలు, పప్పులు, గుడ్లు, చేపలు ఎక్కువ తీసుకోవాలి. కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న మాంసం తక్కువగా తీసుకోవాలి. పోట్రీన్లు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కండపుష్టి నిలకడగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చక్కగా పెంపొంది ఆరోగ్యానికి రక్షణగా ఉంటుంది .యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పళ్లు, పాలు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవచ్చు. సాధారణంగా పెద్దవాళ్లు మంచినీళ్లు తాగడం అశ్రద్ధ చేస్తారు. రోజుకీ కనీసం 15 గ్లాసుల మంచి నీరు తాగాలి. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి.