మంచాల కింద సొరంగాలు

హార్మోన్ సూదిమందులు యాదగిరిగుట్టలో బయటపడిన గుండెలు పిండే దురాగతాలు మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రిలో వ్యభిచార నిర్మూలనకు పోలీసులు వ్యభిచార గృహాల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ దాడులతో నిర్వహకులపై పిడిచట్టం కింద కేసులు నమోదు చేసి వ్యభిచార గృహాలు, లాడ్జీలను సీజ్ చేశారు. బాలికలకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తూ అర్హత లేకపోయినా పలురకాల సిజేరియన్ చేస్తు న్న ఆర్‌ఎంపి వైద్యున్ని అదుపులోకి తీసుకున్నా రు. యాదాద్రి ఆలయ పవిత్రతను కాపాడేందుకు అసాంఘిక కార్యకలాపాలకు […]

హార్మోన్ సూదిమందులు
యాదగిరిగుట్టలో బయటపడిన గుండెలు పిండే దురాగతాలు

మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రిలో వ్యభిచార నిర్మూలనకు పోలీసులు వ్యభిచార గృహాల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ దాడులతో నిర్వహకులపై పిడిచట్టం కింద కేసులు నమోదు చేసి వ్యభిచార గృహాలు, లాడ్జీలను సీజ్ చేశారు. బాలికలకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తూ అర్హత లేకపోయినా పలురకాల సిజేరియన్ చేస్తు న్న ఆర్‌ఎంపి వైద్యున్ని అదుపులోకి తీసుకున్నా రు. యాదాద్రి ఆలయ పవిత్రతను కాపాడేందుకు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిర్మూలించేంత వరకు దాడులు నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్ నెల రోజులుగా సాగుతున్నప్పటికి గత 5రోజులుగా పక్కా సమాచారంతో బ్రోకర్ హౌస్‌లపై దాడులు చేసి అనాధ బాలికలను రక్షిస్తూ వ్యభిచార నిర్వహకులపై కేసు లు నమోదు చేస్తున్నారు. వ్యభిచార గృహాలకు తీసుకువచ్చే బాలికలకు శారీరకంగా హార్మోన్స్ ఇచ్చి వారి ఎదుగుదలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఆర్‌ఎంపి పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటమా డుతూ ఆపరేషన్ చేసిన ప్రైవేటు ఆసుపత్రి ఆర్‌ఎంపిని పోలీసులు రిమాండ్ చేశారు.వ్యవభిచార గృహాలలో పోలీసులు దాడు లు జరిపినప్పుడు తప్పించుకునేందుకు వారి గృహాల్లోని మంచాల కిందనే సొరంగాల లాంటి గుంతలను తవ్వకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థాని క పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి రాంచంద్రారెడ్డి వ్యభిచార గృహాలపై దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో అసాంఘిక కార్యాకలపాలపై తావు లేకుండా ఉండేందుకు వ్యభిచారాన్ని పూర్తి స్థాయి నిర్మూ లించేందుకు రాచకొండ కమిషనర్ ఆదేశాలతో దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.

పోలీసుల దాడుల్లో వ్యభిచార నిర్వాహకులు ఆరుగురు కంసాని నాగలక్ష్మి,కంసాని నరేష్, కంసాని స్వ ప్న, కంసాని కుమారి, కంసాని రజిని,కంసాని ఎల్లయ్య అదుపులోకి తీసుకొని నలుగురు బాలికలను రక్షించినట్లు తెలిపారు. వేశ్య గృహాలలో బాలికలకు హార్మోన్స్ ఎదిగేలా ఇంజక్షన్లను ఇస్తున్నారని సమాచారంతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి అనురాధ నర్సింగ్ హోమ్‌లో ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించగా,48 ఆక్సిటోసిన్ ఇంజక్ష న్లు, పలు మెడిసిన్లు లభ్యమయ్యాయని,ఎటువంటి వైద్య అర్హత లేకుండా ఒకరికి ఎర్నియా ఆపరేషన్, సీజేరియన్ , కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆర్‌ఎంపి కె. నర్సింహ్మ చేసినట్లు నిర్ధారణకు రావడంతో కేను నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు.

పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడటం కోసం వ్యభిచారం నిర్మూలన జరిగేంత వరకు దాడులు కొన సాగిస్తామని డిసిపి తెలిపారు. ఇప్ప టి వరకు ఐదుగురిపై పీడియాక్ట్‌లు పెట్ట గా, ప్రస్తు తం ఆరుగురిపై పీడి యాక్ట్ పెట్టేలా ప్రతిపాదన చేసినట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఎసిపి శ్రీనివాసచార్యులు, సిఐ ఆంజనేయులు, ఎస్‌హెచ్‌ఓ అశోక్‌కుమార్, ఎస్‌ఓటి సిఐ గంగాధర్, ఎస్సైలు

నాగిరెడ్డి, వెంకటయ్య, ఏఎస్‌ఐ సోమయ్య పాల్గొన్నారు.

ప్రజ్వల సంస్థలో అనాధ పిల్లలు :వ్యభిచార గృహ ల్లో దొరికిన 11 మంది బాలికలను ప్రజ్వల సంస్థ ఆమంగల్‌లో చేర్చినట్లు ఐసిడిఎస్ అధికారు లు తెలిపారు.ఎవరైనా తమ పిల్లలు పోయిన వారు ఉంటే డిఎన్‌ఎ పరీక్ష చేసుకొని తమ పిల్లలను తీసు కెళ్ళవచ్చని డిసిపి రామచంద్రారెడ్డి తెలిపారు.

Comments

comments

Related Stories: