భూ నిర్వసిత గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించండి

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో భూ సేకరణ జరిపిన గ్రామాల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. రోడ్ల పక్కనున్న లైన్ల తొలగింపు, ని ర్వాసిత గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణపై గురువారం పె ద్దపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సింగరేణి, కాళేశ్వరం ప్రాజెక్టు నిమిత్తం భూములు సేకరించిన సుందిళ్ల, ముస్తాల, కాశిపేట, జల్లారం, […]

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో భూ సేకరణ జరిపిన గ్రామాల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. రోడ్ల పక్కనున్న లైన్ల తొలగింపు, ని ర్వాసిత గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణపై గురువారం పె ద్దపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సింగరేణి, కాళేశ్వరం ప్రాజెక్టు నిమిత్తం భూములు సేకరించిన సుందిళ్ల, ముస్తాల, కాశిపేట, జల్లారం, ఆరెంద, మల్లారం తదితర గ్రామాల్లో వి ద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరగా ప్రణాళిక రూపొందించి విద్యుత్ లైన్లను పునరుద్ధరించాలని అన్నారు.గతంలో ఉన్న లైన్లను, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి అవసరాన్ని బట్టి వాటిని వాడుకోవడంతో పాటు కొత్త వాటిని తెప్పించి వెంటనే విద్యుత్ సరఫరా చే యాలని అన్నారు.
విద్యుత్ లైన్లను పునరుద్ధరించడానికి 3నెలలు పడుతుందని,దాదాపు 10కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని విద్యుత్ అధికారులు కలెక్టర్‌కు వివరించగా,ముందు ఎస్టిమేట్ రూపొందించాలని కలెక్టర్ సూచించారు.పెద్దపల్లి జిల్లాలోవిద్యుత్‌అవసరాల కోసం రూ.2కోట్లను ప్రభు త్వం కేటాయించిందని,ఈ నిధులతో జిల్లాలోని గ్రామాల్లో రోడ్డు పక్కనున్న లైన్లను మార్చాలని,అధిక సామర్థం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని,ప్రజల ఇం డ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లను తొలగించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇస్సులేటర్లు,వీధి దీపాలు సరిగ్గా పని చేసేలా చర్యలు తీసుకోవాలని,వర్షాకాలంలో లూజ్ కనెక్షన్ల ద్వారా ఎవరికి ప్రమాదం జరుగకుండా ముందస్త్తు జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు ప్రస్తుత భూపాల్ జిల్లా నుంచి 86లక్షల బకాయిలు రావాలని వెంటనే బకాయిలు వసూలు అయ్యేలా సిపిఒ చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. జాతీయ రహదారుల శాఖ విద్యుత్ చార్జీలు చె ల్లించడం లేదని అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా సంబంధిత అ ధికారులతో మాట్లాడి వెంటనే బకాయిలు చె ల్లించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో ఎస్‌ఇ శ్రీనివాస్,డిఇ తిరుపతి సంబంధిత అధికారులు, త దితరులు పాల్గొన్నారు.

Related Stories: