భార్య ఎదుటే భర్త ఆత్మహత్యయత్నం

నిజామాబాద్ క్రైం ః కుటుంబ తగాదల నేపథ్యంలో భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో భార్య తనను అన్యాయంగా వేధిస్తుదంటూ భర్త పోలీసుల ఎదుటే ఆత్మహత్య ఘటనకు యత్నించిన సంఘటన బుధవారం నిజామాబాద్‌లోని మహిళ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఎస్ఐతో సహ సిబ్బంది ఉల్లిక్కి పడ్డారు. భర్తపై ఫిర్యాదు చేసిన అతని భార్య ఇరువర్గాలకు చెందిన పెద్దలు కలవరపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి […]


నిజామాబాద్ క్రైం ః కుటుంబ తగాదల నేపథ్యంలో భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో భార్య తనను అన్యాయంగా వేధిస్తుదంటూ భర్త పోలీసుల ఎదుటే ఆత్మహత్య ఘటనకు యత్నించిన సంఘటన బుధవారం నిజామాబాద్‌లోని మహిళ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఎస్ఐతో సహ సిబ్బంది ఉల్లిక్కి పడ్డారు. భర్తపై ఫిర్యాదు చేసిన అతని భార్య ఇరువర్గాలకు చెందిన పెద్దలు కలవరపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గంగలక్ష్మి, రవితేజ దంపతుల మధ్య కుటుంబ తగదాలు చోటు చేసుకున్నాయి. భర్త తనను వేధిస్తున్నాడంటూ గంగలక్ష్మి పోలీసులను ఆశ్రయించగా డిచ్‌పల్లి పోలీసులు మహిళ పోలీస్‌స్టేషన్‌కు పంపినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం మహిళ పోలీస్‌స్టేషన్‌కు దరఖాస్తు రాగా బుధవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు పిలిచారు.

భార్యభర్తలను సముదాయించే పనిలో ఎస్ఐ తలారిఖాన్ ప్రయత్నిస్తుండగా మానసిక ఉద్వేగానికి లోనైన రవితేజ ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌ బయటకు పరుగులు తీశారు. పోలీసు స్టేషన్ ప్రహరిని ఆనుకొని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ గోడ ఎక్కి అతను తనకు న్యాయం చేయాలంటూ కేకలు వేసాడు. ఎస్ఐతో పాటు రవితేజ బంధువులు ,గంగలక్ష్మి బంధువులు బయటకు వచ్చి కిందికి దిగి రావాలని సూచించారు. అంతటితో ఆగని రవితేజ ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో షాక్‌కు గురైన ఎస్ఐ తాము న్యాయం చేస్తామంటూ కిందికి దిగి రావాలని పదేపదే కొరాడు. అంతలో ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రవితేజ కిందకు విసిరి వేయబడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరు ఉల్లిక్కిపడగా ట్రాన్స్‌పార్మర్ కంచెను తొలగించి రవితేజను ఆసుపత్రికి తరలించారు. రవితేజ, గంగలక్ష్మి దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.

Comments

comments

Related Stories: