భార్యలు, ప్రియురాళ్లకు అనుమతి లేదు

Anushka-Sharma_manatelangan copyన్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు భారత క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) స్పష్టం చేసింది. ఆగస్టు 3న శ్రీలంకలో అడుగుపె డుతున్న టీమిండియా సెప్టెంబరు 2న స్వదేశానికి తిరుగు ప్రయానం కానుంది. గత నెల బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తరువాత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ప్రధాన ఆటగాళ్లందరూ విశ్రాంతి తీసుకోవ డంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘శ్రీలం కలో పర్యటించనున్న జట్టులో చాలామంది ఆటగాళ్లు గత నెలరో జులుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో వారు తమ కుటుంబంతో సంతోషంగా గడిపారు. దీంతో శ్రీలంక పర్యటనకు ఆటగాళ్ల భార్యలను, ప్రియురాళ్లను అనుమతించడం లేదు’ అని బిసిసిఐ అధికారొకరు వెల్లడించారు. ఇక జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న డైరెక్టర్ రవిశాస్త్రి శ్రీలంక పర్యటనకు కూడా ఆలస్యంగా వెళ్లనున్నాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ టీవీ విశ్లేషకుడుగా పనిచేస్తున్న రవిశాస్త్రి ఆగస్టు 12న గాలెలో జరిగే తొలిటెస్టు ఆరంభానికి హాజరయ్యే అవకాశం కనిపించడంలేదు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యాషెస్ సిరీస్ టీవీ విశ్లేషకుడుగా పనిచేయాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక పర్యటనకు కొద్దిగా ఆలస్యంగా హాజరు అవుతానని రవిశాస్త్రి బిసిసిఐ తెలిపినట్లు సమాచారం.

Comments

comments