భార్యను గన్ తో కాల్చిన శాడిస్ట్ భర్త

తిమ్మాపూర్ : అదనపు వరకట్నం తేవాలంటూ భార్యను గన్ తో కాల్చిన సంఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ బుడగ జంగాల కాలనీలో చోటుచేసుకుంది. ఎల్‌ఎండి ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన ఊబిది కనుకయ్య, అదే గ్రామానికి చెందిన స్వప్నను ఇచ్చి 2013లో సంవత్సరంలో వివాహం జరిపించారు స్వప్న తల్లింతండ్రులు పెళ్లి సమయంలో 2 లక్షలు ఒప్పుకోగా లక్ష రూపాయల నగదు ఇచ్చి మిగితా వాటి కోసం బాండు పేపర్ ను రాయించుకున్నారు. కాగా దంపతులు […]

తిమ్మాపూర్ : అదనపు వరకట్నం తేవాలంటూ భార్యను గన్ తో కాల్చిన సంఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ బుడగ జంగాల కాలనీలో చోటుచేసుకుంది. ఎల్‌ఎండి ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన ఊబిది కనుకయ్య, అదే గ్రామానికి చెందిన స్వప్నను ఇచ్చి 2013లో సంవత్సరంలో వివాహం జరిపించారు స్వప్న తల్లింతండ్రులు పెళ్లి సమయంలో 2 లక్షలు ఒప్పుకోగా లక్ష రూపాయల నగదు ఇచ్చి మిగితా వాటి కోసం బాండు పేపర్ ను రాయించుకున్నారు. కాగా దంపతులు ఉపాధి నిమిత్తం నేపాల్ లో ఉంటున్నారు. వారం రోజుల కిందట బందువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో రామకృష్ణకాలనీకి వచ్చారు. స్వప్నను అదనపు కట్నం తేవాలంటూ ప్రతి రోజు మద్యం సేవించి కనుకయ్య మానసికంగా , శారీరకంగా వేధించేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మద్యం మత్తులో కనుకయ్య గన్ తో స్వప్నను కాల్చాడు. దీంతో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు బయాందోళనకు గురయ్యారు. ఎల్‌ఎండి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ స్వప్నను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్వప్న ఆరోగ్యం నిలకడా ఉందని వైద్యులు తెలిపారు. గన్ తో కల్చిన కనుకయ్య పారిపోయేందుకు ప్రయత్నించగా ఎల్‌ఎండి ఎస్‌ఐ నరేష్ రెడ్డి అతన్ని , కాల్చేందుకు ఉపయోగించిన గన్ ను చాకచక్యంగా పట్టుకుని ఎల్‌ఎండి పోలీస్టేషన్ కు తరలించారు. సంఘటన స్థలానికి రాత్రి కరీంనగర్ సిపి కమల్ హాసన్ రెడ్డి పరిశీలించి , కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హన్‌మాన్ టెంపులు సమీపంలో గల డ్రైనేజీ లో శనివారం తెల్లవారుజామున 4 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త కనుకయ్య, అతని తల్లి, తండ్రి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్ రెడ్డి తెలిపారు.

Comments

comments

Related Stories: