భారీ లక్షాల దిశగా సింగరేణి సంస్ధ…

The Singareni Institute is a huge laser

మణుగూరు: మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మాకాలలో 16% వృద్ధిని కనపరిచి. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 5,481 కోట్ల అమ్మకాలు జరుపుకొని, ఈ ఏడాది 890 కోట్ల విలువైన అమ్మకాలను పెంచుకొని 6.371 కోట్ల అమ్మకాలు జరుపుకుందని, దీనిలో బొగ్గు విద్యుత్ అమ్మకాలు కల్సి ఉన్నాయని బొగ్గు అమ్మకాల్లో 17% వృద్ధితో 5, 567 కోట్ల విలువైన బొగ్గు అమ్మడం ద్వారా అంత వృద్ధి సాధ్యమైందని, బొగ్గు రవాణాలో 8.4% నమోదు చేసిందని, ఉత్పత్తిలో 1.5% వృద్ధిని సాధించిందని, ఓవర్ బర్డెన్‌లో 19% వృద్దితో 1043 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని తొలిగించిన కారణంగానే బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని అన్నారు. అదే విధంగా సింగరేణి థర్మల్ విద్యుత్ అమ్మకాల్లో 7% కాగా 804 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరపటం ద్వారా లాభాలు గణనీయంగా పెరగనున్నాయని చైర్మన్ శ్రీధర్ అన్నారు. ఇదే విధంగా మిగిలిన 9నెల కాలంలో కూడ నెలవారి లక్ష్యాలను సాధిస్తూ పోవాలని పిలుపునిచ్చారు.

Comments

comments