ట్రెంట్‌బ్రిడ్జ్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు కేవలం ఆరు పరుగుల తేడాతో టిమిండియా చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ కోహ్లీసేన భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. పదునైనా స్వింగ్ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. 6 వికెట్లకు 307 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టిమిండియా.. మరో 22 పరుగులు మాత్రమే జోడించి, 6 పరుగుల తేడాలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 323 పరుగుల దగ్గర రిషబ్ పంత్ (24) ఔటవడంతో వికెట్ల పతనం మొదలైంది. ఆ వెంటనే అశ్విన్ (14), షమి, బుమ్రా కూడా ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, ఆండర్సన్, క్రిస్ వోక్స్ తలా మూడు వికెట్లు తీసుకున్నారు.
Comments
comments