ఇసుక మాఫీయా…

ఉప్పునుంతలః ఉప్పునుంతల మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న దుంధుభీ నది నుండి ఏలాంటి అనుమతులు లేకుండా రాత్రి, పగళ్ళు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.ఉప్పునుంతల మండల పరిసరా ప్రాంతాల్లోని దాసర్లపల్లి, మామిళ్ళపల్లి, పెద్దాపూర్, లక్ష్మాపూర్, మొల్గర, జప్తిపదగోడు, తిర్మలాపూర్, కంసానిపల్లి, కోరటికల్,తదితర గ్రామాల్లో ఏలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సూమారు 300నుండి 400 ట్రాక్టర్లతో రాత్రి,పగళ్ళు తేడా లేకుండా అనునిత్యం ఇసుక మాఫియాలు ఇసకను తరలించి దుంధుబీని లూటి చేసి జేబులు నింపుకొంటున్నారు. దుంధుభీ నదిలో దోరికె ఇసుకతో ఇండ్లను […]


ఉప్పునుంతలః ఉప్పునుంతల మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న దుంధుభీ నది నుండి ఏలాంటి అనుమతులు లేకుండా రాత్రి, పగళ్ళు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.ఉప్పునుంతల మండల పరిసరా ప్రాంతాల్లోని దాసర్లపల్లి, మామిళ్ళపల్లి, పెద్దాపూర్, లక్ష్మాపూర్, మొల్గర, జప్తిపదగోడు, తిర్మలాపూర్, కంసానిపల్లి, కోరటికల్,తదితర గ్రామాల్లో ఏలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సూమారు 300నుండి 400 ట్రాక్టర్లతో రాత్రి,పగళ్ళు తేడా లేకుండా అనునిత్యం ఇసుక మాఫియాలు ఇసకను తరలించి దుంధుబీని లూటి చేసి జేబులు నింపుకొంటున్నారు. దుంధుభీ నదిలో దోరికె ఇసుకతో ఇండ్లను నిర్మిస్తే చాలా బాగుండండంతో నియోజవర్గంలోని ప్రతి ఒక్కరు దుంధుభీ నది ఇసుకను ఇష్టపడంతో ఇసుక రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది.దానిని అసరాగా తీసుకోని ఇసుక మాఫియాలు ఇసుకను తరలిస్తున్నారు.
వాల్టా చట్టాన్ని ఇసక మాఫియాల చేతుల్లోకి తీసుకోని వారే అధికార యంత్రాంగంగా పనిచేస్తుంటే గ్రామాల్లోన్ని ప్రజలు నివ్వెర పోతున్నారు.అధికారులు ఉన్నారా లేరా అని, ఇదేం నిద్రమత్తు అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మండలంలోని కొంత మంది రాజకీయనేతల పలుకుబడితో ఏలాంటి అనుమతులు లేకున్న వారు చేప్పిందే వేదంగా భావించి ఇసుకను తరలిస్తున్నారు.
రోజురోజుకు వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తుంటే భూగర్బజలాలు అడుగంటిపోతున్నాయాని నది పరిసరా ప్రాంతాల్లోని రైతన్నలు తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు.విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తుంటే రెవిన్యూ,పోలీసు యంత్రాంగాం నిద్రమత్తులో ఉన్నారని మండలంలోని రైతులు,ప్రజలు అవేధన వ్యక్తం చేస్తున్నారు. క్షణం తీరకలేకుండా అనునిత్యం ఇసుకతో నడుస్తున్న ట్రాక్టర్ల శబ్దంతో గ్రామాల్లోని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇండ్లల్లోని ప్రజలకు నిద్రపట్టడంలేదని అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న పట్టించుకోనే అధికారులు కరువాయ్యరని గ్రామస్తులు అంటూన్నారు.

Comments

comments

Related Stories: