భారత్ ఫస్ట్ ర్యాంక్ పదిలం…!

India Remain On Top In ICC Test Rankings after England Series Loss

దుబాయి: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-4 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సిరీస్ పరాజయంతో భారత జట్టు తన ఖాతాలో నుంచి పది పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కమిటీ(ఐసిసి) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా నెం.01 ర్యాంక్ పదిలంగానే ఉంది. ఇంగ్లాండ్-భారత్ జట్ల సిరీస్‌ ముగిసిన వెంటనే ఐసిసి  టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. భారత్ తన ఖాతాలో నుంచి 10 పాయింట్లు కోల్పోయినా 115 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 106 పాయింట్లతో సౌతాఫ్రికాక రెండో స్థానంలో  ఉండగా, సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ 105 పాయింట్లతో నాల్గో ర్యాంక్ లో ఉంది. టెస్టు బ్యాట్స్ మెన్ల విషయానికి వస్తే సిరీస్ ఆద్యంతం రాణించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 930 పాయింట్లతో నెం.01 ర్యాంక్ లో ఉన్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో ఆసీస్ ఆటగాడు స్మిత్(927) ఉన్నాడు. బౌలింగ్ లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తొలి స్థానంలో కొనసాగుతుండగా, భారత బౌలర్లు రవీంద్ర జడేజా నాల్గో ర్యాంక్, అశ్విన్ ఎనిమిదో ర్యాంక్ లో ఉన్నాడు.

Comments

comments