భారత్ పైచేయి..

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. శుక్రవారం లార్డ్ వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్టులో ముందుగా బ్యా టింగ్ చేపట్టిన ఇంగ్లండ్ తొలి రోజు 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టివిరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 123 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న అలిస్టర్ కుక్ (66), మోయిన్ అలీ 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అయితే […]

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. శుక్రవారం లార్డ్ వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్టులో ముందుగా బ్యా టింగ్ చేపట్టిన ఇంగ్లండ్ తొలి రోజు 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టివిరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 123 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న అలిస్టర్ కుక్ (66), మోయిన్ అలీ 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అయితే టివిరామం తర్వాత భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. వరుస క్రమంలో ఇంగ్లండ్ వికెట్లను పడగొడుతూ ముందుకు సాగారు. 90 బంతుల్లో 8 ఫోర్లతో 71 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన ఓపెనర్ అలిస్టర్ కుక్ జస్‌ప్రిత్ బుమ్రా అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 73 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కెప్టెన్ జో రూట్‌ను కూడా బుమ్రా వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన చక్కటి బంతికి రూట్ వికెట్ల ముందు దొరికి పోయాడు. రూట్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరోవైపు వికెట్ కీపర్ జానీ బైర్‌స్టోను ఇషాంత్ ఔట్ చేశాడు. అతను కూడా సున్నాకే వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఒక పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుం ది. ఈ దశలో బెన్ స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు మోయిన్ అలీ ప్రయ త్నించాడు. అయితే 11 పరుగులు చేసిన స్టోక్స్‌ను జడేజా వెనక్కి పంపాడు.  మరోవైపు ఇషాంత్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కష్టాలు మరింత పెరిగాయి. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ ఆటగాడు కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. క్రీజులోకి వచ్చిన కుక్‌కు భారత ఆటగాళ్లు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వా రా భారత ఆటగాడు, తెలుగు క్రికెటర్ హనుమ విహారి అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు.

Comments

comments