భారత్ చిత్తు, ఇంగ్లండ్‌కు సిరీస్

సౌతాంప్టన్: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే గెలుచుకుంది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 60 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 31తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల ఏడు నుంచి లార్డ్‌లో జరుగుతుంది. 245 పరుగుల లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆదివారం నాలుగో రోజు 184 పరుగులకే కుప్పకూలి అవమానకర ఓటమిని చవిచూసింది. […]

సౌతాంప్టన్: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే గెలుచుకుంది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 60 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 31తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల ఏడు నుంచి లార్డ్‌లో జరుగుతుంది. 245 పరుగుల లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆదివారం నాలుగో రోజు 184 పరుగులకే కుప్పకూలి అవమానకర ఓటమిని చవిచూసింది. బౌలర్లు అద్భుత ప్రతిభతో మ్యాచ్‌లో పైచేయి అందించిన బ్యాటింగ్ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. మోయిన్ అలీ మరోసారి అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. మోయిన్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన మోయిన్ బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈసారి కూడా బౌలింగ్‌లో సత్తా చాటాడు. అండర్సన్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ కెఎల్.రాహుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో భారత్‌ను ఆదుకున్న మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు ఫోర్లతో 17 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది.

కోహ్లి, రహానె పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానె తమపై వేసుకున్నారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రహానె రక్షణాత్మకమైన బ్యాటింగ్‌తో ఆడగా కోహ్లి కూడా భారీ షాట్ల జోలికి వెళ్లలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 130 బంతుల్లో 4 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. మరోవైపు రహానె ఒక బౌండరీతో 51 పరుగులు చేశాడు. కుదురుగా ఆడుతున్న వీరిని మోయిన్ వెనక్కి పంపాడు. మోయిన్ అద్భుత బంతికి కోహ్లి పెవిలియన్ చేరాడు. దీంతో 101 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత ఇన్నింగ్స్ 184 పరుగుల వద్దే ముగిసింది. అశ్విన్ (25), రిషబ్ పంత్ (18) తప్ప మిగతవారు కనీసం రెండంకెలా స్కోరును కూడా అందుకోలేక పోయారు. ఆల్‌రౌండ్‌షోతో ఇంగ్లండ్‌ను గెలిపించిన మోయిన్ అలీకి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

Comments

comments

Related Stories: