లండన్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ కు 464 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అలిస్టర్ కుక్(147), కెప్టెన్ జో రూట్(125) భారీ శతకాలతో చెలరేగడంతో 112.3 ఓవర్లలో 8 వికెట్లకు 423 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ ప్రారంభంలోనే మూడు వికెట్లను చేజార్చుకుంది. ఆండర్సన్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(1), ఛతేశ్వర్ పుజారా(1) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ బ్రాడ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే వికెట్ కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. 3.2 ఓవర్లలో రెండు పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడంది టీమ్ఇండియా.
Comments
comments