భారత్‌ అమెరికా కీలక ఒప్పందం

తొలిసారిగా 2+2 చర్చలు న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాల్లో మరో కీలక అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైఖేల్ ఆర్ పోంపియో, రక్షణ యంత్రా జేమ్స్ మాటిస్‌లు పాల్గొన్నారు. సైనిక, భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన కమూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్( కామ్‌కాసా)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ […]

తొలిసారిగా 2+2 చర్చలు

న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాల్లో మరో కీలక అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైఖేల్ ఆర్ పోంపియో, రక్షణ యంత్రా జేమ్స్ మాటిస్‌లు పాల్గొన్నారు. సైనిక, భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన కమూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్( కామ్‌కాసా)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం కింద అత్యంత అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా భారత సైన్యానికి అందజేస్తుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య హాట్‌లైన్‌ను ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం కుదిరింది. చర్చల అనంతరం విడుదలయిన సంయుక్త ప్రకటనలో ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాకు  ప్రధాన రక్షణ భాగస్వామి (ఎంపిడి) హోదాను భారత దేశానికి ఇవ్వడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని ఈ చర్చల ద్వారా మరోసారి స్పష్టమయిందని  పేర్కొన్నారు.

నలుగురు నేతలు సంయుక్త సమావేశం నిర్వహించారు. సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ ప్రాథమిక చర్చల అజెండాపై సంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దు ఆవలివైపునుంచి వస్తున్న ఉగ్రవాదం ముప్పుగురించి చర్చించినట్లు తెలిపారు. ఉగ్రవాదులను లష్కరే తోయిబాలో భాగమని అమెరికా ఇటీవల పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉగ్రవాదం భారత్, అమెరికాలతో పాటుగా యావత్ ప్రపంచంపై సమానంగా ప్రభావం చూపిస్తుందని అన్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ,2019లో భారత తూర్పు తీరంలో అమెరికా, భారత్‌లు సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇటువంటి విన్యాసాలు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. కాగా ఇరు దేశాల సంబంధాల్లో ఈ ఒప్పందం ఒక మైలురాయని పోంపియో అభివర్ణించారు.

Comments

comments

Related Stories: