భారత్‌కు సబ్సిడీలు ఎందుకు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: దిగుమతి సుం కాల పెంపు ద్వారా చాలా దేశాలపై వాణిజ్య యుద్ధానికి తెరతీసిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తాజాగా తమ ఎగుమతులకు సంబంధించి మరో కీలక నిర్ణ యం తీసుకోవాలని అనుకొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్, చైనాలాంటి దేశాలకు సబ్సిడీలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని అనుకుంటున్నారట. ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా చెప్పారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలో కొన్ని దేశాలకు మనం సబ్సిడీలు […]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: దిగుమతి సుం కాల పెంపు ద్వారా చాలా దేశాలపై వాణిజ్య యుద్ధానికి తెరతీసిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తాజాగా తమ ఎగుమతులకు సంబంధించి మరో కీలక నిర్ణ యం తీసుకోవాలని అనుకొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్, చైనాలాంటి దేశాలకు సబ్సిడీలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని అనుకుంటున్నారట. ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా చెప్పారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలో కొన్ని దేశాలకు మనం సబ్సిడీలు ఇస్తున్నాం. భారత్, చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుంటూ సబ్సిడీలు పొందుతున్నాయి. నిజానికి ఆ దేశాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది.

అలాంటప్పుడు వాటికి సబ్సిడీలు ఇవ్వడంలో అర్థం లేదు. ఇదంతా పిచ్చి పని. అందుకే మేము దాన్ని నిలిపి వేయాలని అనుకుంటున్నాం’ అని నార్త్ డకోటాలోని ఫార్గో సిటీలో నిధులసేకరణ కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ)పైన కూడా విరుచుకుపడ్డారు. చైనా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ సంస్థే కారణమని కూడా ఆయన దుయ్యబట్టారు.మరోవైపు అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని కూడా ట్రంప్ చెప్పుకొన్నారు. ‘ నా దృష్టిలో అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. అయితే మిగతా దేశాలకన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం.. అంతే’ అని ట్రంప్ అన్నారు.

Comments

comments

Related Stories: