భానుమతి మళ్లీ ఫిదా చేసిందిపో…!

Sai-Pallavi

హైదరాబాద్: ఫిదా మూవీతో తెలుగు యువతను ఒక్కసారిగా ఫిదా చేసేసింది మలయాళీ బ్యూటీ సాయిపల్లవి. వరుణ్ తేజ్‌తో కలిసి ‘భానుమతి సింగిల్ పీస్.. రెండు మతాలు.. రెండు కులాలు.. హైబ్రీడ్ పిల్లా’ అంటూ ప్రేక్షకులను ఫుల్ ‘ఫిదా’ చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరంటే అతిశయోక్తికాదమో. ఒక్కమాటలో చెప్పాలంటే తన మాయలో పడేసింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్ లు… అందులోనూ ఆమె తన సొంత గొంతుతో చెప్పడంతో ఆ డైలాగ్ లు టపకాయల్లా పేలాయి.

కేవలం ఆమె కోసమే యువత ఫిదా మూవీని మళ్లీ మళ్లీ చూస్తున్నారంటే సాయిపల్లవి ఎంతటి మాయ చేసిందో ఇట్టే తెలిపోతోంది. ఈ ఒక్క మూవీతోనే సాయిపల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్రస్తుతం పోటీ పడుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఆమెకు కోటి రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నారట. అయితే వాటిని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఆమె మాత్రం కోట్లను కూడా వద్దనుకుని కేవలం ప్రాముఖ్యం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. ఉన్నతమైన పాత్రలను పోషించి కొన్ని సినిమాలతో అయినా గుర్తుండిపోవాలని భావిస్తోంది. అందుకే కోట్ల కాసులను కూడా పక్కన పెట్టి పాత్రలకే ప్రాముఖ్యతనిస్తోంది. ప్రస్తుతం సాయిపల్లవి దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న ‘ఎంసిఎ’ మూవీతో పాటు నాగశౌర్య హీరోగా మరో బైలింగ్వల్ చిత్రంలో నటిస్తోంది.

Comments

comments