భానుమతి పారితోషికం పెంచేసిందట..?

హైదరాబాద్: ఫిదా మూవీలో బాన్సువాడ భానుమతిగా అందరీ మదిని దోచేసింది సాయిపల్లవి. ఆ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. అలా ఒక్క మూవీతోనే తెలుగువారిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. దీంతో తెలుగు నిర్మాతలు ఆమె కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఇదిలాఉండగా సాయిపల్లవి మాత్రం తన పాత్రకు ప్రాముఖ్యత ఉండే సినిమాల్లో మాత్రం నటిస్తానని తెగేసి చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ తాజాగా సాయిపల్లవికి సంబంధించిన ఓ పుకారు తెగ షికారు చేస్తోంది. […]

హైదరాబాద్: ఫిదా మూవీలో బాన్సువాడ భానుమతిగా అందరీ మదిని దోచేసింది సాయిపల్లవి. ఆ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. అలా ఒక్క మూవీతోనే తెలుగువారిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. దీంతో తెలుగు నిర్మాతలు ఆమె కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఇదిలాఉండగా సాయిపల్లవి మాత్రం తన పాత్రకు ప్రాముఖ్యత ఉండే సినిమాల్లో మాత్రం నటిస్తానని తెగేసి చెప్తున్నట్లు తెలుస్తోంది.

అయితే టాలీవుడ్ తాజాగా సాయిపల్లవికి సంబంధించిన ఓ పుకారు తెగ షికారు చేస్తోంది. అదేటంటే… ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనేది ఈ వార్త సారాంశం. అంతేకాదు ఏకంగా రెమ్యూనరేషన్ డబూల్  చేసిందట. అయినా బడా నిర్మాతలు మాత్రం ఆమె ఎంత అడిగిన ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి దిల్ రాజు బ్యానర్ లోనే నానితో ఎంసిఎ మూవీలో న‌టిస్తోంది. ఇక మిగిలిన ప్రాజెక్టుల వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments

Related Stories: