భర్త చేతిలో భార్య దారుణ హత్య

మల్కాజిగిరి: స్వస్థలానికి వెళ్ళి కూతురును చూసొద్దాం అనే విషయంలో భార్య భర్తలు గొడవపడి భార్యను భర్త హత్య చేసిన సంఘటన గురువారం అర్థరాత్రి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చల్లూరు గ్రామం, రాయధారం మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణ, లక్ష్మి(55) భార్య భర్తలు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. కూతురు వికలాంగురాలు ఆమెకు నలుగురు పిల్లలు స్వంత ఊరిలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం జీవనోపాధి […]

మల్కాజిగిరి: స్వస్థలానికి వెళ్ళి కూతురును చూసొద్దాం అనే విషయంలో భార్య భర్తలు గొడవపడి భార్యను భర్త హత్య చేసిన సంఘటన గురువారం అర్థరాత్రి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చల్లూరు గ్రామం, రాయధారం మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణ, లక్ష్మి(55) భార్య భర్తలు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. కూతురు వికలాంగురాలు ఆమెకు నలుగురు పిల్లలు స్వంత ఊరిలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మల్కాజిగిరి గౌతంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ భార్య భర్తలు నివసిస్తున్నారు. ఊరికి వెళ్ళి కూతురును చూసొద్దాం అనే విషయంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో భర్త వెంకటరమణ కోపంతో భార్యను నీటి మోటారుతో కొట్టి హత్య చేశాడు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

comments

Related Stories: