భర్త చేతిలో భార్య దారుణ హత్య..

Wife killed her husband in the hands

రాజాపూర్‌: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని రాజాపూర్ మండల పరిధిలోని అగ్రహారం పోట్లపల్లి పంచాయతి బిబినగర్ వాగు శివారులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… రాఘావపూర్ గ్రామానికి చెందిన యాదగిరికి జానంపేటకు చెందిన జానకిని పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అదే విధంగా అగ్రహారం పోట్లపల్లి గ్రామం నుండి మరో మహిళను వివాహం చేసుకొని షాద్‌నగర్ పట్టణంలో నివసిస్తున్నారు. కాగా మొదటి భార్య జానకిని హత్య చేసి అగ్రహారం పోట్లపల్లి దగ్గర్లో ఉన్న బిబినగర్ తాండా శివారులోని వాగులో పాతిపెట్టారు. అనంతరం పోలీసులకు తానే స్వయంగా వేళ్ళి చేయించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సిబ్బంది తెలిపారు.