భర్త ఇంటి ముందు భార్య దీక్ష

మన తెలంగాణ/టేకులపల్లి : తనను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత నిరాకరిస్తున్నాడని పేర్కొంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న సంఘటన ఆదివారం మండల పరిధిలోని జేత్యాతండాలో చోటుచేసుకుంది. ఆమెకు మద్దతుగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా ప్రియుడు కుటుంబ సభ్యులు మాత్రం తమ ఇంటికి తాళం వేసి జారుకున్నారు. వివరాలు… ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెద్ద లచ్చాతండా గ్రామానికి చెందిన అజ్మీర అమలకు, టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ జేత్యాతండాకు […]

మన తెలంగాణ/టేకులపల్లి : తనను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత నిరాకరిస్తున్నాడని పేర్కొంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న సంఘటన ఆదివారం మండల పరిధిలోని జేత్యాతండాలో చోటుచేసుకుంది. ఆమెకు మద్దతుగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా ప్రియుడు కుటుంబ సభ్యులు మాత్రం తమ ఇంటికి తాళం వేసి జారుకున్నారు. వివరాలు… ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెద్ద లచ్చాతండా గ్రామానికి చెందిన అజ్మీర అమలకు, టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ జేత్యాతండాకు చెందిన బానోతు శివ(శివాజీ) కి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. వారు పెళ్లి కూడా చేసుకున్నారు. వారి ఇరువురి పంచాయతీ పలుమార్లు జరిగాయి. కాగా ఆదివారం అమల, తన భర్త శివ ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈమె దీక్షకు మహిళలు మద్దతుగా వచ్చి, సంఘీభావంగా నిలిచారు. ఈ సందర్భంగా అమలు విలేకరులతో మాట్లాడుతూ తమ మధ్య 2013 లో పరిచయం ఏర్పడిందని,ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తాము పెళ్లి చేసున్నామని చెప్పింది. కాని తనను నిరాకరిస్తున్నాడని, అందుకే దీక్షకు పూనుకున్నట్లు ఆమె వివరించింది. కాగా విషయం తెలిసి, స్ధానిక ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో దీక్షా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కాగా అమల దీక్ష కొనసాగుతోంది.

Comments

comments

Related Stories: