భర్తను మట్టుబెట్టిన భార్య

Murder in Hyderabad

హైదరాబాద్ : ఎల్‌ఐసి డబ్బులు, ఉద్యోగం కోసం ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఆపై దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ వద్ద జరిగింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కేస్యానాయక్, పద్మ భార్యాభర్తలు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కేస్యానాయక్ చనిపోతే, అతని ఉద్యోగంతో పాటు ఎల్‌ఐసి డబ్బులు వస్తాయన్న దురాశతో మరో వ్యక్తి వినోద్ సాయంతో భర్తను చంపింది. ముందుగా నాయక్‌కు ఊపిరి ఆడకుండా చేసి అనంతరం కారులో తరలించి, ఆ కారు ఓ కరెంట్ స్తంభానికి ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడడంతో పద్మతోపాటు వినోద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Wife Killed her Husband

Comments

comments