భయం…భయం.. ప్రాణ భయం

నిర్లక్షపు నీడలో గురుకులం                                                                                                          […]

నిర్లక్షపు నీడలో గురుకులం                                                                                                                                    గ్యాస్ లీక్‌తో తప్పిన పెను ప్రమాదం

మన తెలంగాణ/అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను, భోజనాన్ని కల్పిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాలు ఉన్నాయని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఒక్కసారి అన్నపురెడ్డిపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు నిర్లక్షాన్ని చూడండంటూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రధాన కేంద్రంలో బాలురు, బాలికల పాఠశాలలలో ఏదో ఒక నిర్లక్షంతో రాష్ట్రస్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఇదే క్రమంలో గురువారం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఉదయం సుమారు 7 గంటల సమయంలో విద్యార్థులు వంటగదిలో పని చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో పాఠశాలలో ఉన్న 233 మంది విద్యార్థులు పరుగులు తీస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తరగతి గదుల్లో దాక్కున్నారు. ఇంత మంది విద్యార్థులకు రక్షణ కల్పించి, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవటం చర్చనీయాంశం. కన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై భారం అంతా పెట్టి దూర ప్రాంతాల నుండి సైతం తీసుకువచ్చి అప్పజెప్పి వెళ్తే వారు ఆహారపు విషయాల్లో ఒక్కసారి, ఆరోగ్య విషయాల్లో ఒకసారి, గ్యాస్ లీకై మరోసారి భయపెడుతూ నిర్లక్షంగా వహిస్తున్నారని అయినా అధికారులు మాత్రం నిర్లక్షం వహిస్తున్న సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఎమరపాటు క్షణంలో 233 మంది విద్యార్థుల ప్రాణాలు గ్యాస్‌లీక్‌కు ఏమైపోయేవో అని ఇంత పెద్ద ప్రమాదం సంభవించినా సంబంధిత ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఇప్పటికైనా స్థానిక ఎంఎల్‌ఏ గిరిజన పాఠశాలలపై ప్రమాదాలు నియంత్రించే విషయంలో అధికారుల నిర్లక్షంపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

Comments

comments

Related Stories: