భద్రాచలం వద్ద పొంగిపొర్లుతున్న గోదావరి

Flood Water to Godavari River at Bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండడంతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని చర్ల మండలంలోని తాలిపేరు వద్ద కూడా నీటి మట్టం పెరిగింది. తాలిపేరు పూర్తిస్థాయి సామర్థం 74 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి వరదనీరు వస్తుండడంతో తాలిపేరులో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, నీటి మట్టం పెరిగితే దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.

Flood Water to Godavari River at Bhadrachalam

Comments

comments