భజరంగ పసిడి పట్టు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం జకర్తా: ఆసియా క్రీడల్లో ఆదివారం తొలి రోజే భారత్ అదరగొట్టింది. రెజ్లింగ్‌లో భారత స్టార్ భజరంగ్ పునియా స్వర్ణం సాధించాడు. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం. అంతకుముందు షూటింగ్‌లో కూడా భారత్‌కు కాంస్యం లభించింది. అంతేగాక హాకీ, కబడ్డీ పోటీల్లో కూడా భారత జట్లు విజయం సాధించాయి. కానీ, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, సందీప్ కుమార్ తోమర్, పవన్ కుమార్ […]

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

జకర్తా: ఆసియా క్రీడల్లో ఆదివారం తొలి రోజే భారత్ అదరగొట్టింది. రెజ్లింగ్‌లో భారత స్టార్ భజరంగ్ పునియా స్వర్ణం సాధించాడు. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం. అంతకుముందు షూటింగ్‌లో కూడా భారత్‌కు కాంస్యం లభించింది. అంతేగాక హాకీ, కబడ్డీ పోటీల్లో కూడా భారత జట్లు విజయం సాధించాయి. కానీ, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, సందీప్ కుమార్ తోమర్, పవన్ కుమార్ తదితరులు నిరాశ పరిచారు. షూటింగ్‌లో కూడా భారత్‌కు నిరాశ తప్పలేదు. మను బాకర్‌అభిఫేక్ వర్మ జంట క్వార్టర్ ఫైనల్లోనే పరాజయం పాలైంది.

ఎదురులేని భజరంగ్

ఇక, పురుషుల రెజ్లింగ్‌లో భారత స్టార్ భజరంగ్ పుని యా అసాధారణ ఆటను కనబరిచాడు. ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ ఫైనల్‌కు చేరాడు. ఫైనల్లోనూ అద్భుత పోరాట పటిమతో జపాన్ రెజ్లర్ దాచి టకాటానిపై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన సమరంలో భజరంగ్ అద్వితీయ ఆటతో ఆకట్టుకున్నా డు. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ధై ర్యాన్ని వీడలేదు. చివరి వరకు పట్టును నిలబెట్టుకుం టూ ముందుకు సాగాడు. ఇదే సమయంలో 118తో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

అంతకుముందు సెమీస్‌లో మంగోలియా రెజ్లర్ బచులున్‌పై విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగి న సె మీస్ పోరులో భజరంగ్ 100 తేడాతో ప్రత్యర్థిను చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో కూడా భజరంగ్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తజకిస్థాన్ రె జ్లర్ ఖాసిమ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భజరంగ్ 122తో విజయం సాధించాడు. మరోవైపు పసిడి పతకం సాధించిన భజరంగ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు భజరంగ్‌పై ప్రశంసలు కురిపించారు. అసాధారణ ఆటతో భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడని ప్రధాని పేర్కొన్నారు.

Related Stories: