బ్లాక్‌మెయిల్ ఉచ్చులో బాల్కసుమన్!

మంచిర్యాల సిఐ

Balka-Suman

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలలో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవని, డబ్బుల కోస మే బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను సిఐ వెల్లడించారు. మంచిర్యాల పట్టణానికి చెంది న అక్కాచెల్లెళ్లు బోయిని విజేత, బోయిని సంధ్యలు పథకం ప్రకారమే పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో అక్క విజేతకు వివాహం జరగగా భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నారని, సంధ్యకు ఇంకా వివాహం కాలేదని తెలిపారు. గత కొంత కాలంగా వీరు ఇద్దరు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ పలువురిని భయభ్రాంతుకులకు గురి చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాల్క సుమన్‌పై ఆరోపణలు రావడంతో జనవరి 18న కేసు నమోదుచేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయన్నారు. ఎం పి సుమన్ ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న ఫొటోను కాపీ చేసుకొని ఫొటో కట్టింగ్ ఎడిటర్ అనే యాప్ ద్వారా ఫొటోను మార్ఫింగ్ చేసి సంధ్య ఫొటోను పెట్టారని తెలిపారు.

అనంతరం ఎంపి అనుచరులు జనవరి 27న మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో మళ్లీ ఫిర్యాదు చేయగా బోయిని సంధ్య, విజేతలపై ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామన్నారు.అంతే కాకుండా అక్కాచెల్లెళ్లు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లి అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. విజేత, సంధ్యలు గత కొంత కాలంగా అనేక మంది వ్యాపారులను అధికారులను భయబ్రాంతులకు గురి చేసి, డబ్బులు వసూలు చేస్తున్నారని, మంచిర్యాలతో పాటు గోదావరిఖని, కరీంనగర్, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లలో బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. వివరాలు వెల్లడి స్తే కొన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నందు వల్ల వారి వివరాలను గోప్యంగా ఉంచామన్నా రు.

నిరాధారంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లయితే పోస్టింగ్‌లు పెట్టిన వారిపై గ్రూపు అడ్మిన్‌లపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ మేరకు సంధ్య, విజేతలపై 420, 292ఎ, 590, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సెల్ ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా  గతంలో ఎంపి బాల్క సుమన్ లైంగిక వేధింపుల ఆరోపణలపై కొందరు ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని ఎంపి ప్లాట్‌లోకి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వచ్చి దౌర్జన్యం చేసి, తనను బెదిరించారని ఎంపి సహాయకుడు మర్రి సునీల్ గత నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మే 31న సాయంత్రం బంజారాహిల్స్ నందినగర్‌లో ఉన్న ప్లాట్‌కు వెళ్లి పోలీసులు విచారణ జరిపారు.ఆ సమయంలో ఎంపి లేకపోవడంతో వచ్చిన వారు ఆయనను అసభ్య పదజాలంతో దూషించారని, ఎంపి మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. సునీల్ ఫిర్యాదు మేరకు సంధ్య, విజేత, శంకర్, గోపాల్ నలుగురిపై పోలీసులు 448,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Comments

comments