బ్రెజిల్‌ ఆటగాళ్లపై అభిమానుల దాడి

రియో డి జనెరియో: ఫిఫా ప్రపంచకప్ లో బెల్జియంతో జరిగిన క్వార్టర్స్‌ పోరులో బ్రెజిల్‌ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.  టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్‌‌ బ్రెజిల్‌ క్వార్టర్స్‌లో 1-2 తేడాతో బెల్జియం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ దేశ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో బ్రెజిల్‌ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అభిమానులు బస్సును కదలనీయకుండా  రాళ్లు, గుడ్లు […]

రియో డి జనెరియో: ఫిఫా ప్రపంచకప్ లో బెల్జియంతో జరిగిన క్వార్టర్స్‌ పోరులో బ్రెజిల్‌ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.  టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్‌‌ బ్రెజిల్‌ క్వార్టర్స్‌లో 1-2 తేడాతో బెల్జియం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ దేశ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో బ్రెజిల్‌ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అభిమానులు బస్సును కదలనీయకుండా  రాళ్లు, గుడ్లు విసురుతూనే ఉన్నారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోని అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు వినకపోవడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.

Related Stories: