బ్రిడ్జ్‌లో పసిడి..

India pranab shobhnath win gold in bridge

మరోవైపు బ్రిడ్జ్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. పురుషుల పెయిర్ ఫైనల్2లో బర్దన్ ప్రణబ్‌శిబ్‌నాబ్ సర్కార్ జోడీ ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకం గెలుచుకుంది. చైనా జోడీ యంగ్ లిగ్జిన్ చెన్ గాంగ్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా భారత జంట తట్టుకుని ముందుకు సాగింది. చివరి వరకు నిలకడైన ఆటతో ప్రత్యర్థి జోడీకి అవకాశం దక్కకుండా చూసింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలబెట్టుకున్న భారత జోడీ స్వర్ణం సాధించింది. ఈ పోరులో భారత జంట 384 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా, చైనా జంటకు రజతం లభించింది. మరోవైపు ఇండోనేషియాకు చెందిన లసుత్ హెంకిమనొప్పొ జంట కాంస్యం సాధించింది. ఈ క్రీడల్లో తొలిసారి బ్రిడ్జ్ క్రీడాంశానికి చోటు కల్పించారు. దీంతో తొలిసారే భారత్ స్వర్ణం గెలిచి సత్తా చాటింది.

Comments

comments