బ్రిటన్ ను దాటేస్తాం

వచ్చే ఏడాది నాటికి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 10 నుంచి 20 ఏళ్లలో ప్రపంచం లో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటాం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని, వచ్చే ఏడాది నాటికి బ్రిటన్‌ను అధిగమిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించిందని, వచ్చే సంవత్సరం బ్రిటన్‌ను […]

వచ్చే ఏడాది నాటికి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
10 నుంచి 20 ఏళ్లలో ప్రపంచం లో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటాం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని, వచ్చే ఏడాది నాటికి బ్రిటన్‌ను అధిగమిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించిందని, వచ్చే సంవత్సరం బ్రిటన్‌ను కూడా దాటుతామని, తద్వారా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతామని జైట్లీ అన్నారు. ప్రపంచంలో ఇతర దేశాలు చాలా తక్కువ వృద్ధి రేటును కల్గి ఉన్నాయని అన్నా రు. అయితే వచ్చే 10 నుంచి 20 ఏళ్లలో భారత్  ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారనుందని ఆయన అన్నారు. ప్రస్తు తం ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలే తక్కువ వృద్ధి రేటుతో సాగుతున్నాయని అన్నారు. ఇక్కడ కాంపిటిషన్ కమిషన్ ఇండియా(సిసిఐ) నూతన భవనంప్రారంభోత్సవ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ,భారత్ వచ్చే సంవత్సరాల్లో అగ్ర దేశాల ఆశ్చర్చపరుస్తుందని, మూడు అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం 2017 చివరి నాటికి భారత జిడిపి 2.597 ట్రిలియన్ డాలర్లు కాగా, ఫ్రాన్స్ జిడిపి 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంద ని తెలిపారు. అయితే తలసరి ఆదాయంలో మాత్రం ఫ్రాన్స్‌తో పోలిస్తే మన దేశం చాలా వెనుకబడే ఉంది. భారత్ తలసరి ఆదాయంతో పోలిస్తే ఫ్రాన్స్ తలసరి ఆదాయం 20 రెట్లు ఎక్కువ కావ డం గమనార్హం. దీనికి కారణం భారత్‌లో 134 కోట్ల జనాభా ఉంటే, ఫ్రాన్స్‌లో కేవలం 6.7 కోట్ల జనాభా మాత్రమే ఉంది. 2017సంవత్సరానికి గా నూ బ్రిటన్ జిడిపి 2.94 ట్రిలియన్ డాలర్లుగా ఉం ది. 2017-18ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.7శాతంగా నమోదైంది.అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకూలమైన వర్షపాతం, పారిశ్రామిక కార్యకలాపాలు మెరుగవడంతో వృద్ధిరేటు7.4 శాతానికి పెరిగే అవకాశముందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ వృద్ధిరేటు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది బ్రిటన్‌ను దాటగలమని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశా రు. రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక విధానాల రూపకల్పనలో పేరొందిన ఎన్‌సిఎఇఆర్ పునరుద్ఘాటించిం ది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం సమసిపోతున్న సంకేతాలతో భారత్ వృద్ధి రేటు ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది.

Comments

comments

Related Stories: