‘బ్రాండ్ బాబు’టీజర్ వచ్చేసింది

Brand Babu Official Teaser Released

హైదరాబాద్: దర్శకుడు మారుతి కథతో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘బ్రాండ్ బాబు’. మంగళవారం చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రాకి ప్ర‌భాక‌ర్‌ పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతర ప్రధానపాత్రల్లో మురళీశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేశ్పూ, జిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు. జీవన్ బాబు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న బ్రాండ్ బాబు అన్నీ కార్యక్రమాలు ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ మీ కోసం…