కొత్తదనంతో కూడిన…

కొత్త కథలు, కథనాలతో తెలుగు సినిమా వెలిగిపోతోంది. అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100, కేరాఫ్ కంచెరపాలెం తదితర కొత్త తరహా చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కొత్తదనంతో కూడిన మరో చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త నటీనటులతో ఎం.వి.రెడ్డి నిర్మాతగా  మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్, వర్షి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ది ఫాగ్’. ఈ చిత్రానికి మధుసూదన్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. చిన్న సినిమా అంటున్నారు కానీ ఇది పెద్ద సినిమాగా కనిపిస్తోంది. దర్శకుడు మధుసూదన్ ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. విరాట్‌చంద్ర, హరిణి, చందన, ఆత్మనంద, ప్రణీత, సతీష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః యల్లనూరు హరినాథ్, సతీష్ రెడ్డి, మ్యూజిక్‌ః సందీప్.

Comments

comments