బ్యాంకులో చోరీ కేసులో యువకుడు అరెస్ట్

మేడ్చల్: బ్యాంకులో చోరికి యత్నించిన కేసులో నిందితుడిగా యువకుడిని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 18వ తేదీన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఎస్‌బిఐ బ్యాంకు చోరి యత్నానికి సంబంధించి సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డిసిపి తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్‌కు చెందిన హరికృష్ణ డెబ్‌నాథ్ (21) గత మూడేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని గోల్కొండ […]

మేడ్చల్: బ్యాంకులో చోరికి యత్నించిన కేసులో నిందితుడిగా యువకుడిని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 18వ తేదీన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఎస్‌బిఐ బ్యాంకు చోరి యత్నానికి సంబంధించి సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డిసిపి తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్‌కు చెందిన హరికృష్ణ డెబ్‌నాథ్ (21) గత మూడేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని గోల్కొండ కేబుల్ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడి నెలకు వచ్చె జీతం డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు యత్నించాడు. ఈ క్రమంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆగస్టు 18న ఎస్‌బిఐ మల్లాపూర్ పారిశ్రామిక వాడ శాఖ బ్యాంకు వెనకాల రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడు. తెలివిగా లోపల ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను తొలగించి బ్యాంకులోని ఎటిఎంతో పాటు స్ట్రాంగ్‌రూంను ధ్వంసం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో వెనుదిరిగాడు. రెండు రోజుల సెలవుల అనంతరం ఆగస్టు 20న సోమవారం ఉదయం 9.30 గంటలకు బ్యాంకును తెరిచిన బ్రాంచ్ మేనేజన్ అనిల్‌కుమార్ గోడకు రంధ్రం చేసి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. మల్కాజిగిరి డిపిసి ఉమామహేశ్వర శర్మ, ఎసిపి సందీప్‌గోనే, ఎల్‌బి నగర్ క్రైమ్ అదనపు డిసిపి శ్రీనివాస్, సిఐ విఠల్‌రెడ్డి బ్యాంకులోని సిసి పుటేజిలు పరిశీలించి వివిధ కోణాలలో ధర్యాప్తు చేపట్టి పోలీసులు చాకచక్యంగా బ్యాంకులో చోరికి యత్నించిన హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద లభించిన ఇనుప రాడు స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

comments

Related Stories: