బ్యాంకాక్‌లో తెలుగు యువకుడు మృతి

Aandhra Pradesh Man dead in Bangkok

బ్యాంకాక్‌: థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఎపిలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పల్లంపాటి వెంకటేష్ బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. కాగా, వెంకటేష్ హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌లో పని చేస్తున్నట్లు తెలసింది. ఆఫీసు పని మీద బ్యాంకాక్ వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు.వెంకటేష్ మృతి చెందిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో మృతుడి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Comments

comments