బోనమెత్తిన మంచిర్యాల

వాడవాడల్లో పోచమ్మ తల్లి వేడుకలు బోనాల జాతరకు హాజరైన ప్రభుత్వ సలహాదారుడు, ఎంఎల్‌సి మన తెలంగాణ/మంచిర్యాలటౌన్ : ఆషాడమాసం ఆరంభంలో మంచిర్యాల బోనమెత్తింది. వాడవాడల్లో పోచమ్మ తల్లి వే డుకలను ప్రజలు సాంప్రాదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లితో పాటు మైసమ్మ తల్లి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆదివారం మం చిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్ట పోచమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు నల్లలక్ష్మయ్యకోటమ్మ ట్రస్టు చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్ ఆధ్వర్యంలో అంగరంగ […]

వాడవాడల్లో పోచమ్మ తల్లి వేడుకలు
బోనాల జాతరకు హాజరైన ప్రభుత్వ సలహాదారుడు, ఎంఎల్‌సి

మన తెలంగాణ/మంచిర్యాలటౌన్ : ఆషాడమాసం ఆరంభంలో మంచిర్యాల బోనమెత్తింది. వాడవాడల్లో పోచమ్మ తల్లి వే డుకలను ప్రజలు సాంప్రాదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లితో పాటు మైసమ్మ తల్లి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆదివారం మం చిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్ట పోచమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు నల్లలక్ష్మయ్యకోటమ్మ ట్రస్టు చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగాయి. స్థానిక భక్తాంజనేయ సాయిబాబా ఆలయం నుండి బోనాల జాతరను నిర్వహించారు. హమాలివాడ, భగవంతంవాడ, అర్కల్‌వాడ, సప్తగిరికాలని, ఆశోక్‌రోడ్, తిలక్‌నగర్, వేములపల్లి, దొరగారిపల్లి ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో జాతరలో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారుడు , మాజీ ఎంపి గడ్డం వివేకనందా, ఎంఎల్‌ఎ నడిపెల్లి దివాకర్‌రావు, ఎంఎల్‌సి పురాణం సతీష్‌కుమార్‌లు జాతరకు హాజరైనారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల జాతర కన్నుల పండువగా సాగింది. ప్రభుత్వ సలహాదారుడు వివేక్ సతీమణి సరోజతో పాటు మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర, జెడ్‌పిటిసి ఆశలతా, స్త్రీ శిశు సంక్షేమశాఖ కోఆర్డినేటర్ అత్తి సరోజ ప్రత్యేకంగా బోనాలతో జాతరలో పాల్గొని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. వీరితోపాటు మహిళ కౌన్సిలర్లు, నాయకులు కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పాతమంచిర్యాల, ఎసిసి, రాంనగర్, ఎల్‌ఐసి కాలనీ, హమాలివాడ, కాలేజీరోడ్ తదితరులు ప్రాంతాలలో సైడ్‌పిల్లలతో పోచమ్మ, మైసమ్మ మొక్కులను చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంత నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Stories: