బైక్ రైడింగ్..బాధ్యతే!

బైక్‌ప్రయాణం అంటే ఫ్యాషన్, సరదా, సాహసం అనేది ఒకప్పటి బైకర్స్ క్లబ్‌ల మాట. ఇప్పుడీ మాట ట్రాక్ మారింది. సేవ చేయూత సోదరభావంలాంటివి బైక్ రైడర్ల బాటగా మారాయి. అనుభవాలు పంచుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడంలాంటి కార్యక్రమాల్లో బైక్ రైడర్లు ముందుంటున్నారు. దేశంలో దాదాపు 11 కోట్ల ద్విచక్రవాహనాలున్నాయి. వీటిలో ఆటో మొబైల్ కంపెనీ, సీసీ, ఒకే వ్యక్తిత్వం గలవారు వీరంతా కలిసి బైకర్స్ క్లబ్‌లుగా ఏర్పడ్డారు. వాటిలో హార్లీ డేవిడ్‌సన్స్ ఓనర్స్ గ్రూప్ […]

బైక్‌ప్రయాణం అంటే ఫ్యాషన్, సరదా, సాహసం అనేది ఒకప్పటి బైకర్స్ క్లబ్‌ల మాట. ఇప్పుడీ మాట ట్రాక్ మారింది. సేవ చేయూత సోదరభావంలాంటివి బైక్ రైడర్ల బాటగా మారాయి. అనుభవాలు పంచుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడంలాంటి కార్యక్రమాల్లో బైక్ రైడర్లు ముందుంటున్నారు. దేశంలో దాదాపు 11 కోట్ల ద్విచక్రవాహనాలున్నాయి. వీటిలో ఆటో మొబైల్ కంపెనీ, సీసీ, ఒకే వ్యక్తిత్వం గలవారు వీరంతా కలిసి బైకర్స్ క్లబ్‌లుగా ఏర్పడ్డారు. వాటిలో హార్లీ డేవిడ్‌సన్స్ ఓనర్స్ గ్రూప్ ‘హోగ్స్’, కేటీఎం ఓనర్స్ గ్రూప్ ‘కోజ్’ లాంటివున్నాయి. కాలేజీ కుర్రాళ్లు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు అమ్మాయిలు సైతం ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని అందించుకుంటారు. తర్వాత ఒకచోట కలుసుకుని టూర్ల ప్రణాళిక వేసుకుంటారు. ఇలాంటి బైకర్స్ గ్రూప్‌లు దేశవ్యాప్తంగా 400కుపైగా ఉన్నాయి. హైదరాబాద్‌లోనే వాటి సంఖ్య 30 వరకు ఉన్నాయి. హైదరాబాద్ రాయల్స్, హైదరాబాద్ బైకర్స్, మోటో వింగ్స్, కేఓజీ హైదరాబాద్, బీబీసీ హైదరాబాద్, ఇండియన్ బుల్‌రైడర్స్ ఐరన్ హెడ్స్, రాయల్ మావెరిక్స్, హిందుస్థాన్ బైకర్స్..లాంటివి ఈ కోవలోకి వస్తాయి. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలాంటి చిన్న నగరాల్లోనూ బైకర్స్ గ్రూప్‌లున్నాయి.
అందరూ ఉద్యోగాలు, చదువల్లో ఉన్నా వారాంతంలో మాత్రం తప్పకుండా కలుస్తుంటారు. తమ అనుభవాలు పంచుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, కొత్త రుచులు ఆస్వాదించడం, కొత్త ప్రదేశాలు, అక్కడి వాతావరణం, అక్కడి మనుషులను కలిసి వారితో సరదాగా గడపడం వంటివి చేయడం అనేవి సాధారణంగా వీరు చేసేపనులు. ఇప్పుడు వీరు కొంచెం ట్రెండ్ మార్చారు. తమ యాత్రకు ఓ లక్షాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. వోల్ఫ్‌ప్యాక్ ఇండియా అనే క్లబ్ అనాథ పిల్లలకు సాయం చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ఓ ర్యాలీ తీసింది. అదేవిధంగా మరో గ్రూప్ నిర్భయ ఘటనను నిరసిస్తూ పెద్ద యాత్ర చేసింది. వీరు చేసే పనులు మరి కొన్ని ఇతర క్లబ్‌లకు ఆదర్శంగా మారాయి.
బైక్ రైడర్లు తమ లక్షాన్ని మంచి మార్గంవైపు మళ్లించారు. బైక్ రైసింగ్‌పై అవగాహన లేకుండా రయ్ మంటూ దూసుకెళ్లూ యాక్సిడెంట్ల బారినపడుతున్న యువతరాన్ని కలిసి, వారికి బైక్ రైడింగ్‌లో జాగ్రత్తలు, మెళకువలు చెప్పడం చేస్తున్నారు. పర్యావరణ బాధ్యత కూడా తీసుకుంటున్నారు. వెళ్లిన చోట మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, ఎయిడ్స్ డే ర్యాలీలు, చెరువులు శుభ్రం చేయడం, అవినీతి వ్యతిరేక ర్యాలీలు..
ఇలా ప్రతి యాత్రకు ఓ మంచి లక్షాన్ని నిర్దేశించుకుంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలకు స్పాన్సర్లుగా కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. హార్లీ డేవిడ్‌సన్, కవాసాకీ, ట్రయంఫ్, రాయల్‌ఎన్‌ఫీల్డ్ హోండాలాంటి కంపెనీలు తమ కొత్త మోడల్ బైక్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నపుడు పిలిచి మరీ పర్యటనలు చేయమని బైక్ రైడర్లను కోరుతున్నాయి.

గ్రూప్‌లో విలువలు పాటించాలి:
* బైక్ రైసింగ్‌క్లబ్‌లో సభ్యుడుగా చేరాలనుకున్నవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిర్వాహకులు.
* హెల్మెట్, షూస్, మోకాలి ప్యాడ్స్, జాకెట్స్ తప్పనిసరి.
-* బైక్ నడపడం మాత్రమే కాదు మెకానిజం కూడా తెలిసి ఉండాలి. ప్రతి గ్రూప్ ఇలాంటివారు ఒక్కరన్నా ఉండాలి.
-* నూటాయాభై సీసీ దాటిన బైక్‌లతోనే పర్యటించాలి.
* పర్యటన మొదలవడానికి ముందే బైక్‌ను సర్వీస్ చేయించాలి. టూల్‌కిట్, అదనపు బ్యాటరీ కచ్చితంగా అందుబాటులో     ఉంచుకోవాలి.
-* రైడింగ్‌లో ఉన్నపుడు ఒకర్నొకరు ఓవర్‌టేక్ చేయకూడదు. ఫొటోలు, సాహసాలు చేయడంలాంటివి చేయకూడదు.
* అగ్రెసివ్ రైడర్లకు ఈ క్లబ్‌ల్లో స్థానం ఇవ్వరు. వారి రైడింగ్ తీరు, వ్యక్తిగత ప్రవర్తన ముందే పరీక్షిస్తారు.
-* ఐదు, పదిమంది సభ్యులకు ఒకరు చొప్పున లీడర్లుంటారు. వీళ్లు ముందు, వెనక, మధ్యలో ఉంటారు. వీళ్ల ఆజ్ఞల్ని  తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి.
-* బైక్ వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి.- వేగ నియంత్రణ కచ్చితంగా పాటించాలి.

ఒత్తిడి నుంచి ఉపశమనం

ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు నిత్యం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రివరకు ఏదో ఒక పనిలోపడి ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారు. ప్రతిరోజు ఆఫీస్‌కి వెళ్లడం, మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి పడుకోవడంతోనే రోజు గడిచిపోతుంది. ఇంక లైఫ్‌లో ఒక ఎన్‌జాయ్‌మెంట్ లేకుండా పోతుంది నేటి యువతకు. అందులో వాతావరణ కాలుష్యంతో మరింత ఇబ్బందులకు గురౌతున్నారు. అలాంటి వారికి బజాజ్ డోమినర్స్ బైక్ రైడర్స్ వారి ద్వారా రైడింగ్ వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నారు. గోవాలాంటి అందమైన ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ చేయడం ద్వారా ప్రకృతిపై ప్రేమ కల్గుతుంది. ఆరోగ్యం కూడా సొంతమౌతుంది. ఈ రైడర్స్‌ని అక్లాంత్ అనే యువకుడు 2017 లో ప్రారంభించాడు. ఇప్పటివరకు ఇందులో 300 నుంచి 400 వందల వరకు సభ్యులు ఉన్నారు. ప్రతి శనివారం అందరూ కలిసి ఎక్కడకి వెళ్లాలో ప్లాన్ చేసుకుంటారు. తర్వాత అందరూ కలిసి గ్రూప్‌గా చేరి ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కావాల్సిన ఆహార పదార్థాలు వెంట తీసుకెళ్తాం. ఎవ్వరికైనా ప్రమాదాలు జరగకుండా మెడికల్‌కి సంబంధించిన సౌకర్యాలు కూడా చూసుకుంటాం. మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చి బైక్ నడపలేని వారి వెంట వ్యాన్‌ను ఏర్పాటుచేసి అందులో విశ్రాంతి తీసుకునేలా కూడా చూసుకుంటాం.

కొత్త విషయాలు తెలుసుకోవచ్చు

చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. మాములుగా నేను స్పోర్ట్ బైక్ మెకానిక్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేటి యువత చాలా వరకు స్పోర్ట్ బైక్స్‌పై ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. మా దగ్గరకి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటారు. అందులో ఈ మధ్యకాలంలో బైక్ రైడర్స్ గ్రూప్స్ కూడా హైదరాబాద్‌లో చాలా అయ్యాయి. రైడింగ్‌లో పాల్గొనడం ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. ఆందమైన ప్రదేశాలను చూడొచ్చు. ఈ మధ్యకాలంలో  తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కూడా ఈ రైడింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నేను గోవా, తెలంగాణలోని దేవాలయాలు, వాటర్‌ఫాల్స్ వంటివి చూసొచ్చాను. ఎప్పుడు ఇంట్లో ఆఫీసుల్లో కాకుండా ఇలా ప్రతి ఆదివారం బైక్ రైడింగ్ చేయడం ద్వారా మానసిన ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మనకు తెలియని కొత్త విషయాలను, ప్రాంతాలు అక్కడి విషయాలను తెలుసుకోవచ్చు.

మల్లీశ్వరి వారణాసి